»Goat Birth Day Celebrations Goes Viral In Boyalapalli Kalyandurg
Happy Birth Day మేక.. వైరల్ గా మారిన జన్మదిన వేడుకలు
మేకకు జన్మదిన వేడుకలు నిర్వహించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేక బర్త్ డే ఫొటోలను చూసిన వారంతా ఆ దంపతులను మెచ్చుకుంటున్నారు. ‘మీరు సూపర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మనతో పాటు మూగజీవాలు (Animals) జీవిస్తున్నాయి. గుర్రం, ఏనుగు, కుక్క, పిల్లి, కుందేలు, రామచిలక, ఆవు, ఎద్దు, దున్నపోతులు, కోడి, మేక, గొర్రెలు, బాతు, వంటి పశుపక్షాదులను పెంచుకుంటాం. వాటితో మన అవసరాలు తీర్చుకుంటూ వాటిని వదిలేస్తుంటాం. అవసరం తీరాక వాటిని విక్రయించడమో.. లేదా కోసుకు తినడం అలవాటు. కొందరు వాటితో విడదీయలేని అనుబంధం (Relationship) ఏర్పరచుకుంటారు. వాటిని విక్రయించాలంటే వారి మనసు (Heart) ఒప్పదు. ఆ జీవాలు చచ్చే దాకా తమ వద్ద ఉంచుకుంటారు. మూగజీవాలపై అమితమైన ప్రేమ చూపించేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి కోవలోనే ఓ వ్యక్తి తాను పోషిస్తున్న మేకపై అభిమానం పెంచుకున్నాడు. కన్న కొడుకుగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో దాని జన్మదిన వేడుకలు (Birth Day) ఘనంగా నిర్వహించాడు. మేకను అలంకరించి దాని ఫొటోను ముద్రించిన కేక్ ను తయారుచేయించి కట్ చేసి సంబరాల్లో (Celebrations) మునిగారు. ఈ సంఘటన ఏపీ (AP)లోని అనంతపురము జిల్లా (Ananthapuramu District)లో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కల్యాణదుర్గం (Kalyandurg) మండలం బోయపల్లి (Boyalapalli) గ్రామంలో వెంకటేశం, పద్మావతి దంపతులు ఉన్నారు. వీరూ పశు పోషణ (Animal Nutrition) చేస్తూ జీవనం పొందుతున్నారు. ఈ క్రమంలో ఏడాది కింద వారి మేక ఈనింది. తల్లి మేక పిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మేకపిల్ల ఇంట్లో సందడి చేస్తుండేది. చెంగుచెంగున ఎగురుతూ ఇంట్లో కలియతిరుగుతూ ఉత్సాహంగా ఉంటోంది. దాన్ని అల్లారుముద్దుగా ఆ దంపతులు చూసుకుంటున్నారు. తమ పిల్లలతో సమానంగా ఆ మేకపిల్లను చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మేకపిల్ల పుట్టి సంవత్సరం కావొస్తుండడంతో తమ మేకకు జన్మదిన వేడుకలు నిర్వహించాలని ఆ దంపతులు భావించారు.
వెంటనే ఇంటినిండా బెలూన్లు కట్టేశారు. కొంత డెకరేషన్ చేశారు. అనంతరం మేక ఫొటో ఉండేలా కేక్ ను తయారు చేయించారు. ఈ వేడుకకు చుట్టుపక్కల వారిని పిలిపించారు. అనంతరం మేకను శుభ్రంగా తయారు చేసి మేక కొమ్ములకు బెలూన్లు కట్టారు. కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య మేక జన్మదిన వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి మేకకు తినిపించారు. అనంతరం అందరికీ పంచి పెట్టారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మేకకు జన్మదిన వేడుకలు నిర్వహించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేక బర్త్ డే ఫొటోలను చూసిన వారంతా ఆ దంపతులను మెచ్చుకుంటున్నారు. ‘మీరు సూపర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.