»Has The Release Date Of Vijays Goat Movie Been Fixed
Goat: విజయ్ ‘గోట్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?
గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తు.. రీసెంట్గా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు కోలీవుడ్ స్టార్ విజయ్. దీంతో కమిట్ అయిన సినిమాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. తాజాగా గోట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
Has the release date of Vijay's 'Goat' movie been fixed?
Goat: ఇటీవల దళపతి విజయ్ పొలిటికల్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 తమిళనాడు ఎన్నికలే టార్గెట్‌గా విజయ్ పార్టీ పని చేయనుంది. దీంతో మరో రెండు, మూడు సినిమాలు చేసి.. పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాలని చూస్తున్నాడు విజయ్. చివరగా లోకేష్ కనగరాజ్ ‘లియో’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన విజయ్.. టాక్‌తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వెంకట్ ప్రభుతో 68వ సినిమా చేస్తున్నాడు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు.. యువన్‌శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, లైలా వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాను రిలీజ్ డేట్‌ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ముందునుంచి వినిపించినట్టుగా.. జూన్ 13న గోట్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాల మాట.
చదవండి:Prabhas: ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో అనిమల్ బ్యూటీస్?
త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్, కార్తిక్ సుబ్బరాజ్‌తో 69వ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే విజయ్ 70వ సినిమాను చేస్తాడా? లేదా? అనే క్లారిటీ లేదు. కానీ బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ రీమేక్ చేసే అవకాశముందని సమాచారం. ఈ సినిమాను తెలుగు బడా ప్రొడక్షన్ హౌజ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించనుందని అంటున్నారు. మరి విజయ్ ఈ సినిమాలపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.