ఈ మధ్య టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ ట్రెండ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు బాలయ్య కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా సమర సింహారెడ్డి రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
'Samarasimha Reddy' re-release.. will it not be normal?
Samarasimha Redd: ప్రస్తుతం థియేటర్లో కెమెరామేన్ గంగతో రాంబాబు రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఏకంగా థియేటర్లు తగలబడిపోయేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు బాలయ్య నటించిన ‘సమరసింహారెడ్డి’ రీ రిలీజ్ అనేసరికి మామూలుగా ఉండదనే చెప్పాలి. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ తీస్తే.. అందులో సమర సింహారెడ్డి ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు శ్రీకారం చుట్టిన సమరసింహారెడ్డి.. 1999లో సంక్రాంతి సందర్భంగా రిలీజై బాక్సాఫీసు బూజులు దులిపేసింది. అప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేశాడు బాలయ్య. ఫ్యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన ఈ సినిమా.. అప్పట్లో ఓ సంచలనం అనే చెప్పాలి. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మణిశర్మ మ్యూజిక్‌తో థియేటర్లో పూనకాలు తెప్పించింది.
బాలయ్య ట్రైన్ సీన్, గొడ్డలితో విలన్ల ఊచకోత లాంటి సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇప్పటికీ ఈ సీన్స్ కనిపిస్తే చాలు.. స్క్రీన్కు అతుక్కుపోయేలా ఉంటాయి. ఈ హై ఓల్టేజ్ ఫ్యాక్షన్ డ్రామాను పాతికేళ్ల తర్వాత రీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. మార్చి 2 ప్రపంచవ్యాప్తంగా సమరసింహారెడ్డి సినిమాను రీ మాస్టర్ చేసి.. 4కే వెర్షన్‌తో పాటు 7.1 డాల్బీ సౌండ్‌లో రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ సందర్భంగా వచ్చిన డబ్బులను నందమూరి బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరి రీ రిలీజ్‌తో సమరసింహారెడ్డి ఎంత రాబడుతుందో చూడాలి.