»G Kishan Reddy Writes Letter To Telangana Cm K Chandrashekar Rao On Sangeet Natak Akademi
Hyderabad మాకు పదెకరాలు ఇవ్వండి.. సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
. కేంద్ర ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాషాయ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదే క్రమంలోనే ఓ పని కోసం పది ఎకరాల స్థలం చూపించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (G Kishan Reddy) కోరారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party), బీజేపీ మధ్య భూవివాదం (Land Issue) కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం (Govt of India) చేపట్టే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం భూములు ఇవ్వడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాషాయ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదే క్రమంలోనే ఓ పని కోసం పది ఎకరాల స్థలం చూపించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (G Kishan Reddy) కోరారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K Chandrashekar Rao)కు బుధవారం ఆయన లేఖ రాశారు. కేంద్రం నిర్మించే వాటికి భూములు కేటాయించాలని లేఖ (Letter)లో కోరారు.
తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక వారసత్వానికి మరింత ప్రచారం కల్పించేందుకు హైదరాబాద్ (Hyderabad)లో సంగీత, నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ మధ్యలో పదెకరాల భూమి (10 Acre Land) కావాలి. భూమిని గుర్తించి కేటాయించాలి. స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్ర సంగీత, నాటక అకాడమీ (ఎస్ఎన్ఏ) (Sangeet Natak Akademi -SNA) దేశంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వ రూపాల ప్రచారానికి, పరిరక్షణకు కృషి చేస్తుంది. కాకతీయుల కాలం నాటి పేరిణి శివతాండవం, గొల్లసుద్దులు, ఒగ్గు కథలు, గోత్రాలు, చిందు భాగవతం వంటి కథ ప్రదర్శనలు, గుస్సాడీ, లంబాడీ, మయూరి, థింసా వంటి గిరిజన నృత్య రూపాలు వారసత్వంగా లభించాయి. వీటి పరిరక్షణకు, ప్రచారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది’ అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
‘ప్రస్తుత అకాడమీ ప్రాంతీయ కేంద్రాలు (Regional Centre) నృత్యరూపంలో ఉన్న కళల (Art)ను మాత్రమే పరిక్షిస్తోంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే సంగీత అకాడమీ ప్రారంభంతో సంగీతం (Music), జానపద (Folk), గిరిజన కళలు (Tribal Art), నాటకాలు, తోలుబొమ్మల ఆటలపై వస్తృత పరిశోధనలు చేసి డాక్యుమెంటరీ (Documentary)లు రూపొందించి పెద్ద ఎత్తున ప్రచారానికి కృషి చేస్తాం. ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పదెకరాల భూమిని కేటాయించాలి’ అంటూ కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.
Union Minister of Culture G Kishan Reddy writes to Telangana CM K Chandrashekar Rao requesting him to identify & allot suitable land of 10 acres in Hyderabad city for the Sangeet Natak Akademi (SNA) that is an autonomous body under the Ministry of Culture. pic.twitter.com/3lrXiMl5mg