»Telangana Health And Medical Department Safety Precautions To People On Summer
Summer ప్రజల్లారా ఈ జాగ్రత్తలు పాటించండి.. తెలంగాణ హెచ్చరిక
మున్సిపల్ అధికారులకు కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. నీటి కొరత రాకుండా చూసుకోవాలని మున్సిపాలిటీలకు స్పష్టం చేసింది. పశువులు, పక్షులు, జంతువులకు కూడా నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ వేసవి కాలం (Summer)లో ఉష్ణోగ్రతలు (Temperature) గతంలో కన్నా తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఎండలు తీవ్రమవుతున్నాయి. ఉక్కపోతతో పాటు చెమటతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు (Night Time) చల్లగా.. పగటి పూట (Day Time) ఎండ దారుణంగా ఉంటోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు (Safety Precautions) తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ప్రజలకు కీలక సూచనలు చేసింది. వాటిని పాటిస్తే వేసవిలో ఆరోగ్యంగా ఉండవచ్చని తెలంగాణ వైద్యారోగ్య శాఖ (Telangana Health, Medical & Family Welfare Department) పేర్కొంది. ఈ సందర్భంగా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి. కాగా వేసవి దృష్ట్యా వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు. తరచూ అధికారులతో సమీక్ష చేసి చర్యలు తీసుకుంటున్నారు.
సూచనలు ఇవే..
– మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అత్యవసరం ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి.
– పిల్లలు, వృద్ధులు ఎండల్లో తిరగరాదు.
– నీళ్లు తరచూ తాగాలి. దాహం లేకున్నా తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.
– బయటకు వెళ్లేప్పుడు నీళ్ల బాటిల్ తప్పనిసరిగా వెంట ఉండాలి.
– ఎక్కువ నీటి పరిమాణం ఉన్న పండ్లను తినాలి.
– మధ్యాహ్నం పూట వంట చేయకపోవడం మంచిది. వంటింటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి.
– చాయ్, కాఫీ, ఆల్కహాల్ వంటి చక్కెర అధికంగా ఉండే ద్రవ పదార్థాలు తీసుకోవద్దు. అవి శరీరంలోని నీటిని ఎక్కువగా బయటకు పంపుతాయి.
– అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి.
– పార్కింగ్ లో వాహనాలు ఉన్న చోట పిల్లలు, పెంపుడు జంతువులు వదలకూడదు.
– శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు లేదా 104 డిగ్రీ ఫారన్ హీట్ కన్నా పెరగడం, తల తిరగడం, నీరసంగా అనిపించడం, చర్మం పొడిబారడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు విరేచనాలు, గుండె లయ తప్పడం వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
అధికారులకు ఆదేశాలు
జిల్లాస్థాయిలో హెల్ప్ లైన్ కేంద్రాలు, అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఏర్పాటు చేయాలి. 24 గంటలు అందుబాటులో ఉండాలి.
– అన్ని ఆస్పత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉండాలి.
– వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
వీరితో పాటు స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులకు కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. నీటి కొరత రాకుండా చూసుకోవాలని మున్సిపాలిటీలకు స్పష్టం చేసింది. పశువులు, పక్షులు, జంతువులకు కూడా నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పట్టణాఅభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశించారు.