»Love Failure Young Boy Committed Suicide In Turkayamjal
Love Failure జేబులో తాళిబొట్టుతో యువకుడి బలవన్మరణం
ఈ సమయంలో ఊరి చివరన గణేశ్ అచేతనంగా పడి ఉన్నాడని సమాచారం అందడంతో కుటంబసభ్యులు అక్కడకు వెళ్లి చూడగా గణేశ్ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడి జేబులో మంగళసూత్రం ఉండడం గమనార్హం.
ప్రేమించుకుంటారు (Love).. కలిసి జీవిస్తామని (Lifelong) నిర్ణయించుకున్నారు.. సాఫీగా సాగుతుందనుకున్న ఆ ప్రేమ ప్రయాణం అనుకున్నట్టు జరిగితే మీరు ఈ వార్త చదివే వారు కారు. పరిస్థితులు వారి ప్రేమను దూరం చేశాయి. కుటుంబ పెద్దలు (Family Members) వారి ప్రేమ బంధాన్ని తుంచివేశారు. తాను ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహ (Marriage)మైంది. ఈ వార్త తెలుసుకున్న ప్రియుడు తట్టుకోలేకపోయాడు. ఇక తనకు దక్కదని తెలిసి ప్రియురాలి పెళ్లి ఫొటోలు (Photos) చూస్తూ… తాను ఆమె మెడలో కట్టాల్సిన తాళి (Mangalsutra)ని జేబులో వేసుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా (Rangareddy District) తుర్కయాంజల్ మున్సిపాలిటీ (Turkayamjal Municipality) పరిధిలోని మునగనూరు గ్రామంలో పందిగొట్ల లక్ష్మయ్య, అనంతయ్య దంపతులు నివసిస్తున్నారు. వారి రెండో కుమారుడు గణేశ్ (23) లారీ డ్రైవర్ (Lorry Driver)గా పని చేస్తుండేవాడు. స్థానికంగా ఉన్న ఓ యువతితో గణేశ్ కు పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం గణేశ్ తాళి బొట్టు కూడా కొనుగోలు చేశాడు. అయితే ఇటీవల తాను ప్రేమించిన యువతికి ఆమె కుటుంబసభ్యులు మరొక యువకుడితో పెళ్లి చేశారు. అప్పటి నుంచి గణేశ్ తట్టుకోలేక ముభావంగా ఉంటున్నాడు. కాగా ఆ యువతి తన పెళ్లి ఫొటోలను గణేశ్ కు వాట్సప్ లో పంపించింది. వాటిని చూసి తట్టుకోలేక మనస్తాపంతో సోమవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. గ్రామం శివారులో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాత్రి వెళ్లిన గణేశ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి కోసం గాలించారు. ఆందోళన చెందిన వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమయంలో ఊరి చివరన గణేశ్ అచేతనంగా పడి ఉన్నాడని సమాచారం అందడంతో కుటంబసభ్యులు అక్కడకు వెళ్లి చూడగా గణేశ్ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడి జేబులో మంగళసూత్రం ఉండడం గమనార్హం. ప్రేయసిని పెళ్లి చేసుకోనందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని హయత్ నగర్ పోలీసులు (Hayathnagar Police) భావిస్తున్నారు.