నేటి తరం విద్యార్థులు ఒత్తిడిని (Stress) తట్టుకోలేకపోతున్నారు. బట్టి చదువులు చదువుతూ ర్యాంకుల (Ranks) వెంట పరుగు పెడుతున్నారు. కానీ విశ్లేషణా సామర్థ్యం.. సమాజాన్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం వాళ్లు ఫెయిలవుతున్నారు. దీంతో చిన్నపాటి కష్టమొచ్చినా.. కొంత ఒత్తిడికి లోనైనా తట్టుకోలేకపోతున్నారు. దీంతో తమ విలువైన ప్రాణాలను (Life Spoil) బలి తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ శివారులోని నార్సింగ్ లో ఓ ఇంటర్ విద్యార్థి, నిజామాబాద్ వైద్య కళాశాలలో ఇద్దరు వైద్య విద్యార్థులు (Medicos) ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. వాటిని మరువకముందే మరో విద్యార్థిని (Student Suicide) బలవన్మరణానికి పాల్పడింది. హయత్ నగర్ (Hayathnagar Police) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ప్రాణం తీసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు (Bhadradri Kothagudem District) చెందిన విద్య ప్రియాంక నీట్ (NEET) శిక్షణ కోసం హైదరాబాద్ (Hyderabad) వచ్చింది. హయత్ నగర్ పోలీస్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఉన్న ఎక్సైల్ (Excel College) కళాశాలలో చేరింది. అక్కడే వసతిగృహంలో (Hostel) ఉంటూ శిక్షణ పొందుతోంది. సోమవారం అకస్మాత్తుగా రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ లోని నాలుగో అంతస్తు నుంచి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనతో హాస్టల్ విద్యార్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రియాంకను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణం (Cause) తెలియడం లేదు. కాగా ఆ విద్యార్థినికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఎక్సైల్ కళాశాల వివరణ ఇచ్చింది. చౌటుప్పల్ (Choutuppal) సమీపంలో ఉన్న దవవో మెడికల్ అకాడమీలో ప్రియాంక శిక్షణ పొందుతోందని, తాము ఇక్కడ వసతి సౌకర్యం కల్పించినట్లు ఎక్సైల్ కళాశాల తెలిపింది. కాగా బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఏమై ఉంటాయోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారమా? (Love) చదువు ఒత్తిడా? (Study Stress) అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.