»Google Maps Wrong Direction Inter Student Missed Exam
Google Maps తప్పిదం.. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి
నిర్ధిష్ట సమయంలోపు చేరుకున్న వారిని అనుమతించి ఆలస్యంగా వచ్చిన వారికి ప్రవేశం నిషిద్ధం చేస్తున్నారు. ఎంత బతిమాలిడినా.. విన్నవించుకున్నా అధికారులు వినడం లేదు. దీని ఫలితంగా వినయ్ పరీక్ష రాయలేకపోయాడు.
కొత్త ప్రాంతా (New Place)నికి వెళ్లితే అప్పట్లో అయితే దారిన కనిపించే ప్రతి ఒక్కరినీ అడుగుకుంటూ వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ణానం పుణ్యమా అంటూ మనుషులతో పని లేకుండాపోయింది. మనకు తెలియని ప్రాంతమైనా వేరే వాళ్లను మనం ఏమీ అడిగేది అంటూ గూగుల్ మ్యాప్స్ (Google Maps) తెరిచేసి లొకేషన్ (Location) పెట్టేసి వెళ్తున్నాం. కానీ గూగుల్ మ్యాప్ ను అర్థం చేసుకోవడమనేది పెద్ద తలకాయ నొప్పి. ఎన్నిసార్లు వాడినా మ్యాప్స్ చూపించే దాన్ని అర్థం చేసుకోలేకపోతాం. పక్కనే లొకేషన్ ఉన్నా ఊరంతా చూపించేస్తోంది. ఈ మ్యాప్స్ వాడితే నిర్ధిష్ట సమయా (Timely)నికి వెళ్లడం కష్టమే. చాలా సార్లు కొందరు తప్పు దారిన (Wrong Directions) కూడా వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ప్రజలు ఆ మ్యాప్ ను వాడక మానని పరిస్థితి. ఇలాగే గూగుల్ మ్యాప్స్ వాడి ఓ ఇంటర్ విద్యార్థి (Inter Student) పరీక్షకు గైర్హాజరయ్యాడు. గూగుల్ మ్యాప్స్ తప్పుడు లొకేషన్ కు తీసుకెళ్లింది.. అది గుర్తించి తెలుసుకుని అసలైన పరీక్ష కేంద్రానికి వెళ్లగా 27 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో ఆ విద్యార్థి పరీక్ష రాయలేకపోయాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం రూరల్ (Khammam District) మండలం కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్ (Vinay) ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం నుంచి ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాని (Examination Centre)కి వెళ్లేందుకు వినయ్ గూగుల్ మ్యాప్స్ వినియోగించాడు. గూగుల్ మ్యాప్స్ చూపిన ప్రకారం వెళ్లగా అతడు వెళ్లాల్సిన పరీక్ష కేంద్రానికి బదులు వేరే చోటికి వెళ్లాడు. అక్కడకు చేరుకున్నాక ఇది తన పరీక్ష కేంద్రం కాదని కంగారుపడ్డాడు. అనంతరం గూగుల్ మ్యాప్స్ ను వదిలేసి ఇతరులను అడుగుకుంటూ తన వాస్తవ పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే 27 నిమిషాలు ఆలస్యమైంది. ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా రావొద్దనే నిబంధన ఉండడంతో వినయ్ ను అధికారులు పరీక్ష కేంద్రానికి అనుమతించలేదు.
మ్యాప్ కారణంగా వినయ్ పరీక్ష రాయలేకపోయాడు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఒక నిమిషం ఆలస్యం అనే నిబంధన విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. వివిధ కారణాలతో ఆలస్యంగా వచ్చే విద్యార్థులను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (Telangana State Board of Intermediate Education- TSBIE) అనుమతించడం లేదు. నిర్ధిష్ట సమయంలోపు చేరుకున్న వారిని అనుమతించి ఆలస్యంగా వచ్చిన వారికి ప్రవేశం నిషిద్ధం చేస్తున్నారు. ఎంత బతిమాలిడినా.. విన్నవించుకున్నా అధికారులు వినడం లేదు. దీని ఫలితంగా వినయ్ పరీక్ష రాయలేకపోయాడు.