»Huge Changes In Telangana State Bjp Kishan Reddy Is Party President
Telangana: తెలంగాణ రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు.. కిషన్‌రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు!
తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
తెలంగాణ(Telangana) బీజేపీ(BJP)లో పొలిటికల్ హీట్ పెరిగింది. త్వరలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇది వరకూ దీనిపై అనేక కథనాలు వైరల్ అయ్యాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్(Bandi sanjay) ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పదివిపై ఎప్పటి నుంచో ఇతర నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం కూడా ఈ విషయంలో ఓ కీలక మార్పు తీసుకురానుంది. బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు కార్యరూపం దాల్చుతుందనే టాక్ వినిపిస్తోంది.
రాష్ట్ర బీజేపీ(BJP) అధ్యక్ష పదవి పగ్గాలను కేంద్ర మంత్రి, సీనియర్ నేత అయిన జి.కిషన్ రెడ్డి(Kishan Reddy)కి అప్పగిస్తారని సమాచారం. బండి సంజయ్(Bandi sanjay)కు బిజేపీ అధిష్టానం మరో కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి వర్గంలో అయినా లేకుంటే జాతీయ నాయకత్వంలో ఆయనకు బాధ్యతలు అప్పజెప్పనున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయంలో ఓ క్లారిటీ రానుంది.
బండి సంజయ్(Bandi sanjay) వల్ల తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP)కి విపరీతమైన హైప్ వచ్చిందని, అందుకే ఆయనకి పార్టీ జాతీయ నాయకత్వంలో బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. బండి సంజయ్ జాతీయ నాయకత్వంలోకి వెళ్తే ఎంపీ ధర్మపురి అర్వింద్, కె.లక్ష్మణ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావులలో ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.