బంజారాహిల్స్(BanjaraHills)లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లోదారుణం జరిగింది. మెరీడియన్ స్కూల్లో హస్సన్ అనే విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. పాఠశాలలో ఆడుకుంటున్నవిద్యార్థికి కరెంట్ షాక్ (Current shock) తగిలింది . మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలలో పిల్లలందరు అటలాడుతున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్(Transformer)కు ఆనుకుని ఉన్న ఓ ఇనుప కడ్డీని తగిలాడు పిల్లాడు. ఈ విద్యుత్ ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదం జరిగిన వెంటనే పాఠశాల (School) యాజమాన్యం విద్యార్ధిని ఆస్పత్రిలో చేర్పించారు. 45 నుంచి 50 శాతం వరకు గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఇప్పటికే రెండు సర్జరీ చేశామని వారు తెలిపారు. మధ్యాహ్న భోజన విరామంలో ఘటన జరిగిందని పోలీసులు (Police) వెల్లడించారు. ఈ సంఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసుల కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉంటే ట్రాన్స్ఫార్మర్కు సమీపంలో ఐరన్ రాడ్స్ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పూర్తి విచారణ జరిగితే తప్ప ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలిసే అవకాశం లేదు.