»Ssc Pre Final Exam Question Paper Leaked In Andhra Pradesh
Question Paper Leak మరో ప్రశ్నాపత్రం లీకేజీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో..
పరీక్ష పత్రాలు పకడ్బందీ చర్యలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాలు బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఎలాంటి వదంతులు నమ్మకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు.
ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రశ్నాపత్రం లీకేజ్ వారి భవిష్యత్ ను ప్రమాదంలోకి నెట్టింది. తమ భవిష్యత్ ఏమిటి అని ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకవడంతో తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ప్రశ్నాపత్రం లీకేజ్ కలకలం రేపింది. ఇది మరచిపోకముందే మరో లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పరీక్ష రేపు అనగానే ముందు రోజు ప్రశ్నాపత్రం బయటకు వచ్చేస్తోంది. ఇది ఏపీలో అలజడి రేపుతున్నది.
ప్రస్తుతం ఏపీలో పదో తగరతి ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. బుధవారం గణితం పరీక్ష ఉండగా దానికి సంబంధించిన ప్రశ్నాపత్రం మంగళవారం బయటకు వచ్చేసింది. యూట్యూబ్ లో ఈ ప్రశ్నాపత్రం విడుదలైంది. కాకినాడకు చెందిన విద్యార్థులు ఈ విషయమై ఉపాధ్యాయులకు తెలిపారు. పాఠశాలలో రాస్తున్న ప్రశ్నాపత్రం.. యూట్యూబ్ లో ఉన్నది రెండూ ఒక్కటే కావడంతో ఉపాధ్యాయులు షాకయ్యారు. ఈ వ్యవహారంపై ఉన్నత అధికారులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. కాగా పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఈ ప్రశ్నాపత్రాలు బయటకు రావడం చర్చనీయాంశమైంది.
లీక్ చేసిన యూట్యూబ్ ఛానల్ వివరాలు సేకరించారు. వారికి ప్రశ్నాపత్రాలు ఎలా చేరాయో అని ఆరా తీశారు. తెలంగాణలో మాదిరి సొంత సంస్థ ఉద్యోగులే ఈ లీక్ కు కారణమా? అని విచారణ చేస్తున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల పేపర్లు కూడా లీకయ్యే అవకాశం ఉండడంతో సంబంధిత బోర్డు అధికారులు స్పందించినట్లు తెలుస్తున్నది. పరీక్ష పత్రాలు పకడ్బందీ చర్యలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాలు బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఎలాంటి వదంతులు నమ్మకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు.