MLG: మేడారం మాస్టర్ ప్లాన్‌పై క్యాబినెట్లో విస్తృతంగా చర్చ జరిగింది. భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కూడా క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో పోట్లపూర్ ఎత్తిపోతల పథకానికి క్యాబినెట్ ఆమోదం లభించడంతో రైతులకు మేలు చేకూరనుంది.