AP: ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా బురదజల్లుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సిన అవసరం టీడీపీకి లేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా గౌరవంతో తలా ఒక రూపాయి విరాళంగా ఇచ్చినా వేల కోట్ల రూపాయలు నిధులు సమకూరుతాయని పేర్కొన్నారు.