»Minister Koppula Eshwar Inspects Work On Ambedkar 125 Feet Statue
125 Feet Statue సిద్ధమవుతున్న భారీ విగ్రహం.. నిత్య స్మరణం
ల్యాండ్ స్కేప్ ప్రాంతం, రాక్ గార్డెన్, పచ్చదనం పెంపు, పార్లమెంట్ ఆకృతి వచ్చేలా నిర్మాణం, ఫౌంటెన్లు, పార్కింగ్ ప్రాంతం, ఆడిటోరియం వంటివి విగ్రహం ప్రాంతంలో సిద్ధమవుతున్నాయి. ఇటీవల ఈ విగ్రహ పనులపై మంత్రి ప్రశాంత్ రెడ్డితో సీఎం కేసీఆర్ సమీక్షించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr BR Ambedkar) నిలువెత్తు రూపంలో సాక్షత్కరించనున్నాడు. శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి అంబేడ్కర్ విగ్రహం సిద్ధమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashant Reddy), కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం విగ్రహం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం త్వరతగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్ తరాలు (Future) నిత్యం స్మరించుకునేలా హుస్సేన్ సాగర్ (Hussain Sagar) ఒడ్డున భారీ విగ్రహం నిర్మిస్తున్నాం. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా విగ్రహం ప్రారంభిస్తాం’ అని తెలిపారు. కాగా అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ (Hyderabad)లో అంబేడ్కర్ జయంతి (Ambedkar Birth Anniversary) ఉత్సవాల్లో భాగంగా ఈ భారీ విగ్రహం ప్రారంభించనున్నారు.
125 అడుగుల ఈ కాంస్య విగ్రహం చూడముచ్చటగా ముస్తాబవుతోంది. ల్యాండ్ స్కేప్ ప్రాంతం, రాక్ గార్డెన్, పచ్చదనం పెంపు, పార్లమెంట్ ఆకృతి వచ్చేలా నిర్మాణం, ఫౌంటెన్లు, పార్కింగ్ ప్రాంతం, ఆడిటోరియం వంటివి విగ్రహం ప్రాంతంలో సిద్ధమవుతున్నాయి. ఇటీవల ఈ విగ్రహ పనులపై మంత్రి ప్రశాంత్ రెడ్డితో సీఎం కేసీఆర్ సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏప్రిల్ 5వ తేదీలోపు పనులు పూర్తయి 14వ తేదీ ప్రారంభానికి ఏర్పాట్లు జరగాలని సీఎం ఆదేశించారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత శిల్పి రాంసుతార ఆధ్వర్యంలో ఈ విగ్రహం రూపుదిద్దుకుంటోంది.