జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రసంగం చేశారు. ఏపీలో సాగుతున్న అరాచక ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో నిలదీశారు. సీఎం జగన్, మంత్రలపై తీవ్ర విమర్శలు చేయగా.. వాటిపై అధికార పార్టీ స్పందించింది. మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ (Whip) కరణం ధర్మశ్రీ (Karanam Dharmasri) స్పందించారు. ‘పవన్ మాడ్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ తెలిపారు. పవన్ పవర్ స్టారా.. ఫ్లవర్ స్టారా అని ఎద్దేవా చేశారు. చెవిలో పువ్వులు పెట్టుకున్న ఫ్లవర్ స్టారా అని ప్రశ్నించారు. ఒక విధానం.. ఒక నినాదం చెప్పలేకపోయారని పేర్కొన్నారు.
మచిలీపట్నంలో ఊహించని రీతిలో విజయవంతమైన జనసేన ఆవిర్భావ సభ (JanaSena Party Foundation Day)పై బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘కులాన్ని (Caste) నమ్ముకున్నవారిని చూశాం కానీ అమ్ముకున్న వారిని చూడలేదు. నాకు కులం లేదన్న పవన్ కులం మీదే మాట్లాడుతున్నారు. సీఎం వైఎస్ జగన్ వెంట మాలాంటి కాపు నేతలంతా ఉన్నాం. పవన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’ అని హెచ్చరించారు. ‘జనసేన తొత్తుల పార్టీగా మారింది. పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదు ముమ్మాటికీ ప్యాకేజీ స్టారే. జనసేనని చంద్రబాబుకి తాకట్టు పెట్టడానికి పెట్టావ్. మూడు నెలలకు మూడు మెరుపులు. ఆరు నెలలకి ఆరు అరుపుల్లా బయటకి వస్తుంటావు. పవన్ నమ్ముకున్నవాళ్లని మోసం చేస్తున్నాడు. సీఎం వైఎస్ జగన్ నమ్ముకున్న వాళ్లకి రాజ్యాధికారం కల్పించారు. బందర్ మీటింగ్… తొందరపడి పెట్టిన మీటింగా.. కార్యకర్తలని మోసం చేయడానికి పెట్టిన మీటింగా?’ అని ప్రశ్నించారు.