Delhi Tour మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్.. అకస్మాత్తు పర్యటన ఎందుకో తెలుసా?
బడ్జెట్ ప్రసంగం అయిపోయిన అనంతరం సీఎం జగన్ ఢిల్లీకి పయనమయ్యాడు. బడ్జెట్ పరిశీలన కోసం శుక్రవారం అసెంబ్లీకి సెలవు ఇచ్చారు. తిరిగి శనివారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
మరోసారి ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఢిల్లీ పర్యటన (Delhi Tour) చేయనున్నాడు. గురువారం రాత్రి 7.30 ఢిల్లీకి పయనమై శుక్రవారం అక్కడ ఉండనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల (Amit Shah)ను కలవనున్నారు. ఈ పర్యటన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఆకస్మాత్తుగా (Suddenly) ఢిల్లీ పర్యటన చేపట్టడం చర్చనీయాంశమైంది.
సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లిలోని అధికారిక నివాసం నుంచి బయల్దేరనున్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయంలో 7.30కు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అధికారులు కూడా ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి విన్నవించేందుకు ఈ పర్యటన ఉంటుందని అధికారికంగా వెలువడుతున్న సమాచారం. కానీ సీఎం జగన్ ఇతర విషయాలపై చర్చించేందుకు ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రితో సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చట్టపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. దర్యాప్తు సంస్థలు ఓ ముఖ్యమైన కేసు విషయంలో తనను ఇబ్బందులు పెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంపైనే సీఎం జగన్ కేంద్ర పెద్దలకు విన్నవించనున్నట్లు తెలుస్తున్నది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా కూడా కలకలం రేగింది. బడ్జెట్ ప్రసంగం అయిపోయిన అనంతరం సీఎం జగన్ ఢిల్లీకి పయనమయ్యాడు. బడ్జెట్ పరిశీలన కోసం శుక్రవారం అసెంబ్లీకి సెలవు ఇచ్చారు. తిరిగి శనివారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆలోపు ఈ పర్యటన చేపట్టాలని సీఎం జగన్ భావించాడు.