AP Budget రెండు లక్షల కోట్లలో ఏ శాఖకు ఎంత? కేటాయింపులు ఇలా..
మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులకు పెద్దపీట వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా జెండర్ బేస్డ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. కాగా శాఖలవారీగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.
ఆలస్యంగా బడ్జెట్ (Budget)ను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Govt of AP) అంకెలు ఘనంగా.. కేటాయింపులు పేలవంగా అనే తీరులో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2023-24 వార్షిక బడ్జెట్ ను ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath Reddy) గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,79,279 కోట్ల వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టగా.. అందులో కేటాయింపులు (Allotments) ఆసక్తికరంగా ఉన్నాయి. ద్రవ్య లోటు (Deficit)ను రూ.33,316 కోట్లుగా ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇక ద్రవ్యలోటు కూడా పెరిగింది. జగనన్న పాలనతో ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరిగిందని చెబుతున్న వైఎస్సార్ సీపీ (YSRCP) నాయకులు మరి లోటు బడ్జెట్, ద్రవ్య లోటు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్న మొదలవుతుంది. ఈ బడ్జెట్ లో మంత్రి రోజా శాఖకు అతి స్వల్ప కేటాయింపులతో సరిపెట్టారు.
ప్రతి యేటా డబ్బులు పంచే కార్యక్రమానికి లోటు లేకుండా కేటాయింపులు జరిగాయి. బడ్జెట్ ను ఉద్దేశించి సభలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల (AP People) జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా బడ్జెట్ ఉంటుందని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అసెంబ్లీలోని తన కార్యాలయంలో బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు కీలక రంగాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు మంత్రి తెలిపారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులకు పెద్దపీట వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా జెండర్ బేస్డ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. కాగా శాఖలవారీగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.
బడ్జెట్ కేటాయింపులు ఇలా
రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
రెవెన్యూ లోటు రూ.33,316 కోట్లు
ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం
ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం
వైఎస్సార్ పింఛన్ కానుక రూ.21,434.72 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
జగనన్న విద్యా దీవెన పథకం రూ.2,841.64 కోట్లు
జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు
వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1,600 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ.1,000 కోట్లు
రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు
వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు
లా నేస్తం రూ.17 కోట్లు
యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు
షెడ్యూల్డ్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు
షెడ్యూల్ తెగల సంక్షేమం రూ.6,929 కోట్లు
వెనుకబడిన తరగతుల సంక్షేమం రూ.38,605 కోట్లు
కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు
మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు
పేదలందరికీ ఇల్లు రూ.5,600 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ రూ.9,118 కోట్లు
నీటి వనరుల అభివృద్ధి రూ.11,908 కో్టుల
పర్యావరణం, అటవీ శాష్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు
ఎనర్జీ రూ.6,456 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ శాఖ రూ.3,858 కోట్లు
గడపగడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
వైఎస్సార్ కల్యాణ మస్తు పథకం రూ.200 కోట్లు
వైఎస్సార్ ఆసరా రూ. 6,700 కోట్లు
జగనన్న చేదోడు రూ.350 కోట్లు
వైఎస్సార్ వాహన మిత్ర రూ.275 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
వైఎస్సార్ మత్య్సకార భరోసా రూ.50 కోట్లు
రైతు కుటుంబాలకు పరిహారం రూ.20 కోట్లు
జగనన్న తోడు రూ.35 కోట్లు
ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు
అమ్మఒడి రూ.6,500 కోట్లు
డీబీటీ స్కీమ్ లకు రూ.54,228.36 కోట్లు
ధర స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు
మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
స్కిల్ డెవలప్ మెంట్ రూ.1,166 కోట్లు