ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నుంచి వస్తున్న విమర్శలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పర్యటిస్తున్న సమయంలో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వలన తమకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలను ఏమాత్రం జంకు లేకుండా నిలదీస్తున్నారు. వీటిని తట్టుకోలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రశ్నించిన ప్రజలపై దాడులకు పాల్పడిన సంఘటనలు ఇటీవల చాలా జరిగాయి. తాజాగా మరో ఎమ్మెల్యే సమస్యపై ప్రశ్నించిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. అందరి ముందు ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. అయితే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ప్రశ్నించిన వ్యక్తినే పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది.
మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని నీరుగట్టువారిపల్లెలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే నవాజ్ పాషా పాల్గొన్నాడు. రామిరెడ్డి లేఔట్ వినాయకుని వీధిలో పర్యటిస్తూ ఓ ఇంటికి వెళ్లాడు. లక్ష్మీనారాయణ అనే ఇంటి యజమానితో మాట్లాడాడు. స్థానికంగా రోడ్డును బాగు చేయించాలని ఎమ్మెల్యేను కోరాడు. ప్రస్తుతం ఉన్న రోడ్డుపైనే రోడ్డు వేయిస్తానని ఎమ్మెల్యే చెప్పగా.. వద్దు అలా చేస్తే రోడ్డు ఎత్తు పెరిగి ఇల్లు దిగువకు వస్తుందని చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులు లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు. సమస్యపై ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అని స్థానికులు ఆందోళన చేశారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఇలాంటి సంఘటనలు తరచూ ఏపీలో చోటుచేసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వీరికి పోలీసుల సహకారం తోడవడంతో మరింత రెచ్చిపోతున్నారు.
అయితే ఎమ్మెల్యే ప్రవర్తనపై కొన్నాళ్లుగా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అతడి ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. గతంలో మున్సిపల్ చైర్మన్ తో అసభ్యంగా ప్రవర్తించడం.. వెకిలి చేష్టలు చేశాడు. అంతకుముందు ఓ అధికారితో దుర్భాషలాడాడు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. కాగా ఏపీలో ఇలాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వీరికి పోలీసుల సహకారం తోడవడంతో మరింత రెచ్చిపోతున్నారు.