మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. బోనాల పండగ సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూత పడనున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
బోనాల పండగ సందర్భంగా వచ్చే ఆదివారం 16వ తేది నుంచి 17వ తేది వరకూ మద్యం షాపులు మూతపడనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 17వ తేది ఉదయం 6 గంటల వరకూ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలో మద్యం షాపులను మూసివేయనున్నారు. అలాగే సౌత్ జోన్ పరిధిలో 16వ తేది ఉదయం 6 గంటల నుంచి 18వ తేది ఉదయం 6 గంటల వరకూ రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటన చేశారు. దీనికి సంబంధించి అధికారులకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బోనాల సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.