ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు (Mohan Babu) మీడియాపై మండిపడ్డారు. షాద్ నగర్లో రిపోర్ట్లుపై కాసేపు చిందులు తొక్కారు. బుద్ధి లేదా మీకు అంటూ అసహనం వ్యక్తం చేశారు. మైక్ లోగోలు (Mike logos) లాగేయండి అంటూ తన బౌన్సర్లకు పురమాయించారు.మోహన్ బాబు తన ఆస్తికి సంబంధించి వీలునామా కోసం వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయితే ఈ వ్యవహారం మీడియా (Media) దృష్టి పడకుండా ఆయన వ్యవహరించడంతో అక్కడ ఉన్నవారు ఏం జరుగుతుందోనని చూస్తూ ఉండిపోయారు. మీడియాపై చిందులు తొక్కిన వ్యవహారం, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు రాద్ధాంతం అయింది.
మోహన్ బాబు వచ్చిన విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు అక్కడికి తరలివచ్చారు. మోహన్ బాబును మాట్లాడించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీస్తుండడంతో అక్కడ హడావిడి నెలకొంది. జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని అన్నాయి. గతంలోనూ ఆయన, ఆయన కుటుంబ సభ్యులు మీడియాపై దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ (Manchu Manoj) వివాదంపై మోహన్ బాబు దురుసుగా వ్యవహరించారు. విష్ణు, మనోజ్ వివాదంపై ప్రశ్నించగా.. మీడియా ప్రతినిధులనే ఎదురు ప్రశ్నించారు.