వైఎస్ వివేకానంద హత్య కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల విషయంలో సీబీఐ స్పీడు పెంచింది. ఈ క్రమంలో కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న వారిని భారీ బందోబస్తు నడుమ ఏపీ పోలీసులు కడప జైలు నుంచి హైదరాబాద్ కు తరలించారు. వీరిని సీబీఐ కోర్టులో 10:30 గంటలకు హాజరు పరచనున్నారు.
అయితే వివేకా హత్య కేసులో కడప జైల్లో ఏ2 గా సునీల్ కుమార్ యాదవ్, ఏ3 గా ఉమా శంకర్ రెడ్డి, ఏ5గా దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇక ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఏ4గా ఉన్న అప్రూవర్ దస్తగిరిలు బెయిల్పై బయటికొచ్చారు. తిరిగి విచారణ సీబీఐ చేపట్టిన క్రమంలో నిందితులందర్ని సీబీఐ కోర్టు మళ్లీ విచారిస్తోంది. అయితే ఏ1, ఏ2 లు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు.