జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మత ప్రభోధకుడు కేఏపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ విలువ రోజు రోజుకీ దిగజారిపోతోందంటూ కేఏ పాల్ పేర్కొనడం గమనార్హం.
ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 9 పార్టీలు మారాడని చురకలు అంటించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం మొదలు బహుజన సమాజ్వాది పార్టీ, బిజెపి లాంటి ఎన్నో పార్టీలతో జట్టు కట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయడంతో అతని ఓట్ బ్యాంక్ అంతా నాశనమైందని పాల్ ఆరోపించారు.
2008లో పార్టీ పెట్టారే కానీ సొంత సీటులో కూడా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడని అతనిని విమర్శించారు. పవన్ అసులు పార్టీని లీడ్ చేయడం ఏమిటి? అసలు పవన్ కళ్యాణ్ కి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకదని ఆయన విమర్శించారు. వెంటనే పవన్ కళ్యాణ్ తన పార్టీలో చేరాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ పాల్ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పాల్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా వైసీపీకి చెందిన వారు మాత్రం పాల్ ను సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ పాల్ పార్టీలో చేరాలని కామెంట్ చేస్తుండటం గమనార్హం.