KA Paul : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్…!
KA Paul :కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని ఆయన కామెంట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ ఉప ఎన్నికలో మూడు లక్షల ఓట్లు ఉంటే మూడు వేల ఓట్లు పడ్డాయని, ఇక భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ గెలవదనే విషయం అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని ఆయన కామెంట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ ఉప ఎన్నికలో మూడు లక్షల ఓట్లు ఉంటే మూడు వేల ఓట్లు పడ్డాయని, ఇక భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ గెలవదనే విషయం అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కోవర్టు అని పేర్కొన్న ఆయన ఇక మీదట కాంగ్రెస్ పార్టీ గెలవదని అందరికీ తెలుసని అన్నారు. ఇక అలాగే బిజెపి పార్టీ తెలంగాణలో ఎక్కడా లేదన్న ఆయన బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తుడుచుకుపోయిందని అన్నారు, అందుకే జాతీయ పార్టీ పెట్టాడని చెప్పుకొచ్చారు.
ఇప్పుడున్న పార్టీలన్నీ రెండు మూడు కుటుంబాలకు ఆయా కులాలకే పరిమితం అయ్యాయని పేర్కొన్న ఆయన నేను బీసీని అయినా దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని అందుకే 90 శాతం ప్రజలు నాకు సపోర్ట్ గా ఉన్నారని అన్నారు. మరోపక్క అంబేద్కర్ పుట్టిన రోజునే సెక్రటేరియట్ ఓపెన్ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.