సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ, అతని లీల మూవీతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం 2020లో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పుడు మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత DJ టిల్లు భారీ థియేట్రికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా టిల్లూ స్క్వేర్తో రాబోతున్నాడు. కానీ ఇంకొన్ని సినిమాల విషయంలో టిల్లు రాంగ్ స్టెప్ వేశాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ(jonnalagadda Siddu) డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రానికి ముందు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో రూట్ మార్చిన సిద్ధుకు.. డీజే టిల్లు మూవీతో మంచి బ్రేక్ లభించింది. దీంతో యూత్‌లో ఊహించని క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’పేరుతో సీక్వెల్ చేస్తూ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కూడా పక్కా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు.
కానీ, తన కెరీర్ లో మంచి సినిమాలు ఎంచుకోవడంలో ఈ హీరో రాంగ్ స్టెప్ వేస్తున్నాడా అనే అనుమానం కలుగుతోంది. ప్రముఖ స్టైలిష్, స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన తొలిసారి డైరెక్టర్ గా మారుతున్నారు. ఆమె సినిమాలో సిద్ధు హీరోగా నటిస్తున్నారు. అసలు దర్శకత్వం మీద అవగాహనలేని ఆమెతో సినిమా అంగీకరించి సిద్ధు తప్పు చేశాడా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరో సినిమా సమంత(samantha) హీరోయిన్, నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ మూవీలో సిద్ధూ హీరోగా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇది కచ్చితంగా ఉమెన్ సెంట్రిక్ మూవీ అవుతుందని, సిద్ధు కెరీర్ కి పెద్దగా ఉపయోగపడదేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
మరోవైపు చిరంజీవి(chiranjeevi) హీరోగా సోగ్గాడే చిన్నినాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ సిద్ధూ నటిస్తున్నాడట. చిరంజీవి సినిమాలో పాత్ర దక్కడం అంటే అదృష్టం కావచ్చు. కానీ, పెద్దగా స్కోప్, నిడివి ఉండే పాత్ర దొరకడం కష్టం కదా అనే వాదన ఎక్కువగా ఉంది. ఆ మూవీ క్లిక్ అయినా, క్రెడిట్ చిరు ఖాతాలోకి పోతుంది కదా. ఇవన్నీ ఆలోచించకుండా సిద్ధు ఇలాంటి సినిమాలు ఎందుకు ఎంచుకుంటున్నాడని ఆయన ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. మరి ఆయన ఆలోచన ఎలా ఉందో మనకు తెలీదు కదా. ఆయన కెరీర్ మాత్రం బాగుండాలని కోరుకుందాం.