అచ్చం తెలుగు అమ్మయిలా కనిపించే అవికా గోర్ సోషల్ మీడియాలో ఫలు యాక్టివ్ అయ్యింది. ముంబయిలో జన్మించిన ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు ఆకట్టుకుంటుంన్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
యంగ్ హీరోయిన్ అవికా గోర్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.
ఈ క్రమంలో పలు మూవీలు చేస్తూ ఓ సినిమాకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించింది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫొటో షూట్ చిత్రాలను పంచుకుంటుంది.
తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని చిత్రాలను పోస్ట్ చేయగా..అవి చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. మరికొంత మంది హాట్ బ్యూటీ, లవ్ యూ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అవికా గోర్ జూన్ 30, 1997న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ముంబైలోని ములుండ్ శివారులోని షారన్ ఇంగ్లీష్ హై స్కూల్లో చదువుకుంది
ఆమె 2007లో Ssshhh…Koi Haiతో హిందీ టెలివిజన్లోకి అడుగుపెట్టింది
ఈ అమ్మడు ఉయ్యాల జంపాలా (2013)తో తెలుగు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి SIIMA అవార్డును సైతం గెలుచుకుంది.
ఈ అమ్మడు 2023 పాప్కార్న్ మూవీలో నటించడంతోపాటు ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది.
దీంతోపాటు ఉమాపతి ఫిల్మ్స్, 1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ వంటి చిత్రాల్లో యాక్ట్ చేస్తుంది.