Vadhuvu Webseries: ఓపెన్ చేస్తే ఇందు, సంజయ్ ల పెళ్లి హడావిడి జరుగుతుంది. వచ్చిన బంధువులను ఇందు అమ్మ నాన్న రిసీవ్ చేసుకుంటారు. ఇందును రెడీ చేయడానికి ఈశ్వరీ వెళ్తుంది. రేణుకను పిలిచి ఇందు రెడీ అయిందా అని అడిగితే గంట నుంచి ఇంకా రెడీ అవుతూనే ఉందని రేణుక అంటుంది. తరువాత ఇందు చిన్నాన్న కంగారు పడుతూ వస్తాడు. అన్నయ్య ఎక్కడా అని రేణుకను అడిగి, వడ్డిస్తున్న అన్నయ్య దగ్గరకు వెళ్లి అతన్ని తీసుకొని వస్తాడు. అతని వెంటే రేణుక, ఈశ్వరీ కూడా వస్తారు. పెళ్లింట్లో ఏం చేస్తున్నావురా అని బంధువులందరు బయట ఉన్నారని అన్నయ్య అడిగితే, ఈ పెళ్లి జరగదు అని చెప్తాడు. ఏంటా అపశకునపు మాటలు అని వదినా అంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పమని వాళ్ల అన్నయ్య అంటాడు. పెళ్లికూతరు ముస్తాబులో ఉన్న ఒక అమ్మాయి ఒక వ్యక్తిని తీసుకొని పారిపోతుంది. దాంతో వీళ్లు షాక్ అవుతారు. తరువాత పెళ్లికూతురు రెడీ అవుతున్న గదిలోకి వెళ్లి ఈ పెళ్లి జరగట్లేదని ఇందుతో చెప్తారు. రెడీ అవుతున్న ఇందు షాక్ అయి చూస్తుంది. వధువు డ్రెస్ లో ఉన్న వ్యక్తి ఒకతన్ని తీసుకొని పారిపోతుంది. వధువు అని టైటిల్ పడుతుంది. ఒక సంవత్సరం తరువాత ఇందు, ఆనంద్ వెడ్డింగ్ బోర్డ్ ను సెట్ చేస్తుంటారు. మళ్లీ పెళ్లి హడావిడీ జరుగుతుంది. ఈశ్వరీ నగలు అన్ని తీసి రేణుకకు ఇచ్చి ఇందును అన్ని వేసుకోమని చెప్పు అంటుంది. ఇందుకు మంగళస్నానాలు చేయిస్తుంటారు. అక్కడికి రేణుక వచ్చి ఇందును తీసుకొని వచ్చి తల తూడుస్తుంది. పెళ్లి దగ్గరపడుతున్నా కొద్ది భయం వేస్తుందని, ఈ సారి పెళ్లి ఆగితే తట్టుకునే శక్తి తనకు లేదని ఈశ్వరీ అంటుంది. పెళ్లింట్లో ఇలాంటి మాట్లాడొచ్చునా అని వాళ్ల అత్త మందలిస్తుంది. ఇందు దిగులుగా ఆలోచిస్తుంది.
చదవండి:Pushpa 2 ఐటెం సాంగ్ కోసం ఇద్దరు హాట్ బ్యూటీస్?
తరువాత సీన్లో ఆనంద్ ఇంటికి బంధువులు వస్తుంటారు. పెద్దగా ఒక అరుపు వినిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్లు పరుగెత్తుకుంటు వెళ్తారు. అక్కడ పద్మ బొమ్మలతో ఆడుకుంటూ చేయి కోసుకుంటుంది. అది చూసిన ఆనంద్ తల్లి భ్రమరాంబ ఒకవైపు పెళ్లి హడావిడీ జరుగుతుంటే దీన్ని ఎవరు బయటకు రానిచ్చారు. సార తీసుకోబోయే టైమ్ లో ఇంట్లో రక్తం చిందించడం అశుభం అని అంటుంది. అన్ని తెలిసే చేస్తుంది అని తనను కొడుతుంది. అమ్మను కొట్టొద్దు అని పాప తనను హత్తుకుంటుంది. దీని వలనే ఆనంద్ కు మూడు సార్లు పెళ్లి ఆగిపోయిందని భ్రమరాంబ కొప్పడుతుంది. మతిస్థిమితం లేని దాన్ని ఓ గదిలో వేసి తాళం వెయ్యాలి కానీ ఇలా బయట వదిలేస్తారా అని కొప్పడుతుంది. ఆర్యా, స్నేహా అలానే చూస్తూ ఉంటారు. పద్మను నేను తీసుకెళ్తా తన తల్లి లోపటికి తీసుకెళ్తుంది. అంతా పాడు చేసింది, మీ పెద్దమ్మ పెద్దనాన్న వళ్లా ఏం కాదు అని సారను మీరు తీసుకెళ్లండి అని స్నేహ, ఆర్యాలకు భ్రమరాంబ చేబుతుంది. వాళ్లు వెళ్లిపోతారు. పద్మ ఆడుకుంటున్న బొమ్మకు తన రక్తం ఉంటుంది.
తరువాత సీన్లో ఇందు ఇంట్లో.. ఇందునాన్నను తీసుకొని పెళ్లికూతురు తగ్గరకు తీసుకొస్తాడు తన తమ్ముడు. తన కూతురు ఎంత అందంగా ఉందని మురిపోతుంటాడు ఇందునాన్న. తన చెల్లి వల్ల గతంలో తన పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే ఈ పెళ్లి ఆగిపోతుందేమో అని ఆందోళనగా ఇందు అంటుంది. పెళ్లికొడుకును తన చెల్లెలు లేపుకొని పోతుంది. అలాంటిదాని పేరు ఈ ఇంట్లో వినిపించకూడదు అని వాళ్ల బామ్మ అంటుంది. తరువాత సార తీసుకొని ఆర్య, స్నేహ వస్తారు. వారు మాట్లాడుకుంటుండగా పైనుంచి ఇందు చూస్తుంది. చూసి వెళ్లిపోతుంది. దాన్ని ఆర్య చూస్తాడు.
మరో వైపు ఆనంద్ వాళ్లింట్లో పనోడు ఏదో తీసుకొని వెళ్తుంటే భ్రమరాంబ ఏంటని అడుగుతుంది. అతను ఏం చెప్పడు. అతను వెళ్లి ఒక డోర దగ్గర చేయి చాపితే అతనికి సిగరేట్, అగ్గిపెట్టే ఇస్తాడు. భ్రమరాంబ పొగను చూస్తుంది. సార ఇచ్చి ఆర్యా, స్నేహ ఇంటికి బయలు దేరుతారు. ఏం తినకుండా వెళ్తున్నారు అంటే మా వదిన చేతి వంట మా ఇంట్లోనే తింటాము అని స్నేహ అంటుంది. దానికి స్నేహ తమ్ముడు ఆర్య వచ్చేటప్పుడు కార్లో కేకులు, స్వీట్లు తినింది అంటే అందరు నవ్వుతారు. వారికి నమస్కారం పెట్టి వారు బయలుదేరుతారు. అక్కడికి వాళ్ల పనిమనిషి రాజయ్య వచ్చి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇంట్లోకి వస్తారా అని అడుగుతాడు. దాంతో ఇప్పటికే ఏ సమస్య వస్తుందో అని భయపడుతుంటే నువ్వేంటి అని సరే పదా అని అంటాడు ఇందు ఫాదర్. అతనితో పాటే వంట గదిలోకి వెళ్తాడు. అక్కడ పనస పండును చూపిస్తాడు. దానికి కుట్లు ఉంటాయి. ఎవరు వేశారు అని మాట్లాడుకుంటారు. పండును కోస్తే అందులో ఒక ఆకు ఉంటుంది. వాళ్లకు ఏం అర్థం కాదు. ఈ ఆకును ఎక్కడో చూసినట్లు ఉందని మాట్లాడుకుంటారు. ఇది వాళ్ల ఆచారమేమో అని ఈశ్వరీ అంటుంది. ఇదేం ఆచారం అని తన భర్త అంటాడు. కంగారు ఎందుకు ఫోన్ చేసి కనుకుంటే సరిపోతుంది అని భ్రమరాంబకు కాల్ చేస్తారు. తను మాట్లాడుంది. పనస పండుకు కుట్లు వేశారు అనగానే ఫోన్ సిగ్నల్ బాలేదని, గొడ్లసావిడుకు వచ్చి మాట్లాడుతుంది. పండు కోసి కుట్లు వేశారు. అందులో ఏదో ఆకు కూడా ఉందని చెప్తారు. దీంతో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అది బయట పడేయండి ఇంకోటి పంపిస్తాను. ఇంటి నిండ చుట్టాలు ఎవరు చేశారో ఎమో అంటుంది. వీళ్లు కూడా రిలాక్స్ అవుతారు. దాన్ని బయట పడేయమని చెప్పడంతో సరే అని రాజయ్య తీసుకెళ్తాడు. ఈ విషయాన్ని ఇందు వింటుంది.
ఆ సారలు ఎవరు ప్యాక్ చేశారు అని ఆనంద్ ఇంట్లో భ్రమరాంబ కొప్పడుతుంది. ఏమైందమ్మా అని ఆర్య అడిగితే పనస పండులో ఎవరో ఆకు పెట్టి కుట్లు వేశారట. ఈ పెళ్లి జరగకూడదని ఎవరో చూస్తున్నారు అని అంటుంది. అన్నయ పెళ్లి జరగకూడదు అని మనవాళ్లు ఎందుకు అనుకుంటారు అని ఆర్యా అంటాడు. దాంతో భ్రమరాంబకు డౌట్ వచ్చి పద్మనే చేసిందని అక్కడ సూది చూసి తనను కొడుతుంది. ఆర్య తనను ఆపి ఈ సూదితో ఎలా సాధ్యం అవుతుందని తనను పంపిస్తాడు. తరువాత సూదినే చూస్తాడు. పద్మబయపడి చూస్తుంది.
మరో సీన్లో రాజయ్య పనసపండును బయట పడేయ్యడానికి వెళ్తుంటే ఒక్క నిమిషం అని దానిలో ఆకును తీస్తుంది ఇందు. దాన్ని తీసుకెళ్లి వాళ్ల బామ్మకు చూపించి దీన్ని ఎప్పుడైనా చూశావా అని అడుగుతుంది. దాన్ని పరిశీలించిన బామ్మ ముందు దాన్ని కిందపడేయి, అది ఉమ్మెత్త ఆకు దానిలో విషం ఉంటుంది అని చెప్తుంది. దీన్ని బయటపడేసి సబ్బుతో చేతులు కడుక్కో అని చెప్పి వెళ్తుంది. తన పెళ్లి విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తుంది. అదే సమయంలో ఇందు చెల్లెలు భాను కార్లో వస్తుంది. నీ వల్ల పెళ్లి ఆగకూడదు అని సంజయ్ అంటే అది నా చేతులో లేదు అని అంటుంది.
తరువాత సీన్లో ఆర్య వచ్చి పెద్దమ్మ రెడీ అవు పెళ్లివారింటికి వెళ్దాం అంటాడు. దానికి నేను రావట్లేదు బాబు, పద్మను ఇంట్లో వేసి తాళం వేశాను అంటుంది. అక్కడ ఏదైనా జరిగితే మళ్లి బాధపడాలి అంటుంది. ఇక్కడికి ఎవరైనా తెలియని వాళ్లు వచ్చారా అని అర్య అంటాడు. తెలియని వాళ్లు అంటే వైష్ణవి గురించా అంటుంది. ఆ విషయం ఇప్పుడెందుకు అని అక్కడినుంచి వెళ్లిపోతాడు ఆర్య. నువ్వు ఇంకా వైష్ణవిని మరిచిపోలేదా అని అంటుంది. దాంతో ఆర్య తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. తరువాత సీన్లో భాను, సంజయ్ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. వాళ్ల అమ్మనాన్నను కలిసి అక్కను కలిసొస్తా అని పైకి వెళ్తుంది.
మరో సీన్లో ఒక అతను బస్ స్టాండ్ లో నిల్చొని ఇక అమ్మాయి నడుము చూస్తాడు. తన వెనుకాలే బస్సు ఎక్కి ఆ అమ్మాయి నడుము నొక్కుతాడు. వాళ్లు బస్ నుంచి బయటకు గెంటేస్తారు. తరువాత సీన్లో ఆనంద్ ఇంట్లో వంటలు చేస్తుంటారు. అక్కడికి భ్రమరాంబ వచ్చి నీ భర్త ఏక్కడ అని స్నేహను అడుగుతుంది. అంతలో బస్ నుంచి గెంటేసిన వ్యక్తి వరండాలో నిలబడి చూస్తుంటాడు. తరువాత స్నేహ, తన భర్త ఇద్దరు మాట్లాడుకుంటారు. నెక్ట్స్ సీన్లో ఆనంద్ గన్ శుభ్రం చేస్తుంటాడు. ఆర్య అక్కడి వచ్చి టెన్షన్ పడుతున్నావా అని అడుగుతాడు. ఇప్పటికే మూడు పెళ్లిల్లు ఆగాయని, ఈ పెళ్లి అన్న జరగాలి అంటాడు. అయినా పద్మ ఎందుకు నీకు పెళ్లి అనగానే అలా చేస్తుంది అంటాడు. నాకే కాదు మన అన్నదమ్ముల్లో ఎవరి పెళ్లి అయినా ఇలానే చేస్తుంది అంటాడు. ఎందుకు అలా అంటే నీ వల్లనే అంటాడు. అయినా నా పెళ్లి బాగానే జరిగింది కదా అంటే అప్పుడు పద్మ అత్తాగారింట్లో ఉందని, బాగా జరిగినా ఏం లాభం ఇప్పుడు నీ భార్య నీతో లేదుగా అంటాడు. వైష్ణవి గురించి ఇప్పుడు ఎందుకు అని అక్కడి నుంచి వెళ్తాడు. తరువాత సీన్లో భాను ఇందు దగ్గరకు వెల్లి చాలా బాగా ముస్తాబు అయ్యావు అని ఇంత అందంగా రెడీ అయినందుకన్నా ఈ పెళ్లి కావాలి అంటుంది. ఇందు ఏం మాట్లాడదు. నీ మొదటి పెళ్లి గురించి కాబోయే బావగారికి తెలుసా అని అడుగుంది. ఆ మాటలకు ఇందు షాక్ అవుతుంది.
పెళ్లి బాజంత్రీలు మోగుతుంటాయి. ఆనంద్ పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. అక్కడికి ఇందు బాబాయ్ వచ్చి పూజారి చేవులో ఏదో చెప్తాడు. తరువాత ఇందునాన్నతో ఒక్క నిమిషం పక్కకు రా అన్నయ్య అంటాడు. ఆనంద్ డౌట్ పడుతూ చూస్తాడు. తనతో పాటే ఈశ్వరీ వెళ్తుంది. పెళ్లి కొన్ని నిముషాల్లో పెట్టుకొని ఇందు కనిపించకుండా పోవడం ఏంటి అని వెతకండి అంటాడు. ఆనంద్ వాళ్లింట్లో పద్మ లైట్ తో ఆడుకుంటుంది. వాళ్ల అమ్మ అన్నం కలిపి తినమంటే తనకు వద్దంటుంది. పెళ్లి భోజనాన్ని వద్దనొద్దు అని అంటుంది. పెళ్లి అయిపోయిందా అని అడుగుతుంది. తరువాత ఆనంద్ ఆర్యకు ఏమైందో కనుక్కో అని సైగ చేస్తాడు. ఆర్య తనను వెతకాడానికి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లి కళ్లద్దాలు తీసి ఆలోచిస్తుంటాడు. మరో సీన్లో ఆ పెళ్లి జరగొద్దు, ఆ అమ్మాయి ఇంటికి రాకూడదు, తనకు కూడా వైష్ణవికి జరిగినట్లే జరుగుతుంది అని అంటుంది. ఆర్య ఒక డోర్ దగ్గరకు వెళ్లి తీయగానే అక్కడ ఇందు ఉంటుంది. కట్ చేస్తే ఇందును బుట్టలో మండపానికి తీసుకొని వస్తారు. ఆనంద్ తాళి కడుతుంటే సంజయ్ వైపు ఇందు చూస్తుంది. సంజయ్ కూడా చూస్తాడు. అది ఆనంద్ గమనిస్తాడు. తరువాత తాళి కట్టేస్తాడు. భాను గట్టిగా కట్టు బావ అంటుంది. తరువాత రిసెప్షన్ జరుగుతుంది. అక్కడ అందరు ఫోటోలు దిగుతుంటారు. తాళి కట్టెప్పుడు అతను వైపు ఎందుకు అలా చూసింది అని ఆనంద్ అడుగుతాడు. తాను వాళ్ల చెల్లి భర్త అని ఆర్య చెప్తాడు.
ఆర్య ఇందు కోసం వెళ్లినప్పుడు ఒక డోర్ తీస్తే అక్కడ ఇందు ఉంటుంది. మీరెంటి ఇక్కడ అని అడుగుతాడు. ఎవరో చీటి ఇచ్చారు. మాట్లాడాలి ఇక్కడికి రమ్మంటే వచ్చాను సడెన్ ఎవరో డోర్ పెట్టి వెళ్లిపోయారు అంటుంది. ఎంత కొట్టినా డోర్ తీయలేదు అని చెప్తుంది. అయినా నేను ఇక్కడ ఉన్నానని నీకేలా తెలుసు అంటుంది. ఆర్య ఆలోచిస్తాడు. ప్రస్తుతం రిసెప్షన్ లో ఫోటోలు దిగుతుంటారు. భాను తన భర్త సంజయ్ తో ఫోటో దిగడానికి వస్తుంది. తన భర్తను అక్క పక్కనే నిల్చొమని తాను ఆనంద్ పక్కన నిలబడి ఫోటో దిగుతుంది. అందరూ ఫోటోలు దిగుతారు. కట్ చేస్తే డోరు తీసుకొని పిల్లలు ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వస్తారు. అక్కడికి స్నేహ వస్తుంది. పెద్దమ్మ వచ్చి పెళ్లి ఎలా జరిగింది అని అడుగుంది. బానే జరిగింది అని చెప్పి వెళ్తుంది. తరువాత స్నేహ భర్త పద్మ రూమ్ దగ్గర నిలబడి ఉంటాడు. పద్మ పడుకొని ఉండడం చూసి అలానే చూస్తూ ఉంటాడు. అక్కడికి తన కుతూరు వచ్చి లోపలికి వెళ్లి డోర్ వేస్తుంది.
మరో సీన్లో ఇందు నగలు మార్చుకుంటుంటే బయట సంజయ్ ఉంటాడు లోపలిక వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి ఆర్య వచ్చి తన భుజం మీద చేయి వేస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నారని అంటే, తన వైఫ్ కోసం చూస్తున్నా అంటాడు. తరువాత అతన్ని కిందికి తీసుకొని వెళ్తాడు. అదే సమయంలో ఇంటి వెనుకాల ఎవరిదో నీడ కనిపిస్తుంది. అదే సమయంలో డోర్ తీస్తే భాను వస్తుంది. బావ కింద ఒంటిరిగా ఉన్నాడు అంటుంది. కిందికి వెళ్తుంది. ఇంటి బయటకు వెళ్తుంటే ఆర్య చూస్తాడు. ఇందు వెతుక్కుంటు వెళ్తుంటే ఆర్య అలికిడికి భయపడుతుంది. ఎవరికోసం వెతుకుతున్నారు అని ఆర్య అడుగుతాడు. ఇక్కడ ఎవరో ఉన్నారు అని చెప్తుంది. ఈ టైమ్ లో ఎవరు ఉంటారు అని ఆర్య అనుకుంటుండగా.. ఇందు కాలుకు సూది గుచ్చుకుంటుంది. దాని వాసన చూస్తుంది. అంతలో అక్కడ ఒక గేట్ ఓపెన్ చేసి కనిపిస్తుంది. దాన్ని ఎవరు తీశారు అని ఆర్య అంటాడు.
కట్ చేస్తే ఉదయం ఇంట్లో స్నేహ తన కూతురి తల దువ్వుతుంది. తన భర్త గడ్డం గీసుకుంటాడు. అదే సమయంలో అక్కడికి భ్రమరాంబ వచ్చి ఈ రోజు కోడలు ఇంటికి వస్తుంది. మన ఇంట్లో గతంలో జరిగిన విషయాలు ఏవి తనకు తెలియాల్సిన అవసరం లేదని చెప్తుంది.
తరువాత సీన్లో భానును పెళ్లికి పిలువలేదని అన్నారు. ఈ శుభలేక ఏమిటి అని ఈశ్వరీ అడుగుతుంది. ఇది తన రైటింగ్ కాదని అంటాడు. ఇదే విషయాన్ని ఇందు వింటుంది. తరువాత ఇంట్లో వాళ్లందరు గిఫ్ట్ లు చెక్ చేస్తారు. హిందుకు కొరియర్ వచ్చిందని వాళ్ల బాబాయి ఇస్తాడు. దాన్ని ఓపెన్ చేస్తే సూది ఉంటుంది. అందరూ దాని వైపు చూస్తారు. తాను స్మెల్ చేసి పనసపండువాసన వస్తుందని అనుకుంటుంది. తరువాత ఆర్య గేటు వైపు చూస్తాడు. తరువాత ఇందు రెడీ అవుతుంటే వాల్ల పిన్ని వచ్చి ఈ చీర కట్టుకొ అని చెప్తుంది. తను వెళ్లిన తురువాత గదిలోకి సంజయ్ వచ్చి డోర్ వేస్తాడు. ఇందు కంగారు పడుతుంది. నీతో మాట్లాడాలి భానుతో తాను నరకం చూస్తున్నట్లు చెప్తాడు. ఇప్పటికీ నువ్వంటేనే ఇష్టం అని తన చేతులు పట్టుకుంటాడు. అంతలో సంజయ్ డోర్ తెరుస్తాడు. అది చూసి డోర్ నాక్ చేయాల్సింది నాదే తప్పు అని డోర్ వేసి వెళ్తాడు. కింద భాను దగ్గరకు వెళ్లి నీ భర్త ఇందు రూమ్ లో ఉన్నాడు అని చెప్తాడు. దాంతో ఇందు రూమ్ భాను వెళ్తుంది. తాను అక్కతో మాట్లాడాలి అంటుంది. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే అన్ని నీకే దక్కాలి అనుకుంటావు. అందరూ నిన్నే ఇష్టపడుతారు. అని తన స్కూల్ డేస్ లో జరిగిన విషయాలను గుర్తుకు చేసుకుంటుంది. స్కూల్ ఇందు ఫస్ట్ రావడం, తనకు ప్రపోజల్స్ రావడంతో ఇందుపై కోపం పెంచుకుంటుంది. అందుకే నీకు కాబోయే సంజయ్ ను పెళ్లి చేసుకున్న అని చెప్తుంది. అయినా అందరు నన్నే తిడుతున్నారు అని అంటుంది. అలా కాదు అని ఇందు అంటే భాను చిరాకు పడి వెళ్లిపోతుంది. భాను ఇంతకు ముందులా లేదు, తాను అనుకున్నది కచ్చితంగా చేసి తీరుతుంది. తనతో జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు.
నెక్ట్స్ సీన్లో ఆనంద్ సిగరేట్ తాగుతుంటే అక్కడికి ఆర్య వస్తాడు. పొద్దునుంచి కనిపించకుండా పోయావు అని అడుగుతాడు. కొన్ని విషయాలు తెలుసుకోపోవడమే మంచిది అని ఆర్య అంటాడు. తరువాత ఇంటికి బయలు దేరుతారు. ఇంట్లో నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని నీ కాలుకు గాయం అయిన విషయం అమ్మకు చెప్తాను దాంతో నీకు పని తగ్గుతుంది అని ఆర్య అంటాడు. అయినా ఆ సమయంలో ఇంటి వెనుకకు ఎందుకు వెళ్లావు అని ఆనంద్ అంటాడు. తరువాత ఇంటి కార్లు వస్తాయి. పని మనిషి వింతగా చూస్తాడు. కారు దిగి గుమ్మం దగ్గరకు వస్తారు. దిష్టి, ఆరతి తీస్తారు. కాలు పెడుతుండగా కట్టు కనిపిస్తుంది. ఏమైందని అడుగుతే చిన్న గాయం అయిందని చెప్తారు. దాంతో కట్టు తీసేయ్ అలా ఇంట్లోకి రాకూడదు అని భ్రమరాంబ చెప్తుంది. అలాగే అని కట్టు తీస్తుంది. తన ముందు పసుపు కుంకుమ నీళ్లులో అడుగుపెట్టమంటారు. తన కాలుకు గాయం అయిందని ఆర్య అంటున్నా సంప్రదాయం పాటించాలి అంటుంది. పర్లేదు అని ఇందు కాలు పెడుతుంది. మంట మంట అని అరుస్తుంది. అదే సమయంలో పద్మ కిటికీ నుంచి ఇంట్లోకి అడుగుపెట్టకు పారిపో, వీళ్లు నిన్ను చంపేస్తారు. నువ్వు మంచి అమ్మాయివి అని అరుస్తుంది. ఇందు షాక్ అవుతుంది.
పాలు పొంగుతుంటాయి. పద్మ భయపడుంది. పాలను చూడమంటే నేను ఇక్కడ ఉండను అమ్మదగ్గరకు వెళ్తా అని బయటకు వస్తుంది. బయట ఆర్య, ఆనంద్ ఉంటారు. మళ్లీ ఆ ఇంటికి రావాలని ఉందా అని ఆనంద్ అంటాడు. పద్మ నేలమీద కూర్చొని నోటికి చేయి పెట్టుకొని ఏడుస్తుంది. మళ్లీ ఆ గదిలోనే ఉంటావా, ఆ గదిలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసు కదా అని అంటాడు. ప్రస్తుతం పద్మ తన గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది.
తరువాత సీన్లో స్నేహ ఇందుకు కాలును తన మీద పెట్టుకుంటుంది. దాంతో తన కాలును ముట్టుకోవడం ఇష్టం లేదని చెప్తుంది. నా వల్లే ఇలా జరిగింది కదా అని అయింట్ మెంట్ పెడుతుంది. ఈ మాత్రం చేయకపోతే అన్నయ్యకు కోపం వస్తుందని చెప్తుంది. మీ అన్నయ్య కోపిస్టా అంటే ఎప్పుడో ఒక సారి వస్తుంది అని అలా వచ్చినప్పుడు తనను కంట్రోల్ చేయడం కష్టం అని చెప్తుంది. చివరి సారిగా ఎప్పుడు కోపం వచ్చిందని అడుగుతుంది. ఇంట్లో వైష్ణవి చేసిన తప్పు గురించి అందరు తిడుతుంటాడు. నీకు ముందే చెప్పాను ఆర్య తను మన ఫ్యామిలీకి కరెక్ట్ కాదని, నువ్వే నా మాట వినలేదు. నువ్వు చేసిన పని వల్ల నా తమ్ముడి కళ్లల్లో కన్నీల్లు చూశాను.. వెళ్లిపోతావా మెడబట్టి గెంటేయ్యాలా అని అంటాడు. ఇంకో క్షణం ఈ ఇంట్లో ఉంటే నేనే చంపేస్తా అంటాడు. ఫ్లాష్ బ్యాక్ కలకంటుంది. ఇందు స్నేహను పిలుస్తుంది. తరువాత పద్మ గురించి అడుగుతుంది. తనకు మెంటల్ ప్రాబ్లమ్ అని చెప్తుంది. అంతలో పద్మ అరుస్తుంది. వెంటనే స్నేహ అక్కడి నుంచి వెళ్తుంది. అదే సమయంలో పద్మను వాళ్ల అమ్మ కొడుతుంది. అలా ఎందుకు అన్నావు అని కొడుతుంది. అక్కడే కుటుంబం అంతా ఉంటుంది. ఆనంద్ కొప్పడుపడుతాడు. అదే సమయంలో స్నేహ వచ్చి ఏం చేస్తున్నారు. తన అరుపులు వదిన రూమ్ కు వినిపిస్తున్నాయి అని అంటుంది.
తరువాత సీన్లో ఇందు బయటకు వస్తుంది. పనిమనిషి మీరెందుకు బయటకు వచ్చారు అని అడుగుతుంది. పొద్దున కాలు పెట్టిన పల్లంలో మెట్టె పడిపోయిందని అది ఎలా ఉందో అలానే తీసుకురా అని చెప్తుంది. తరువాత ఇంట్లో వాళ్లు మాట్లాడుకుంటే వింటుంది. అది స్నేహ భర్త చూస్తాడు. తరువాత పద్మను స్టోర్ రూమ్ పెట్టాలి అని మాట్లాడుకుంటారు. ఆ ఏర్పాట్లు చూడు అని ఆర్యకు చెప్తుంది. ఇందు అక్కడినుంచి వెళ్లిపోవడం ఆర్య చూస్తాడు. తరువాత పని మనిషి పల్లేం తీసుకొని వస్తుంది. మెట్టెను చూసి వెళ్లిపోదాం అనుకుంటుంది. తరువాత పెల్లెంలో కారంపొడి కలిసిందని అంటుంది. పనిమనిషి దాన్ని తీసుకొని ఇదే విషయాన్ని భ్రమరాంబకు చెప్తుంది. తరువాత ఆర్య కార్ ను రిపేర్ చేస్తుంటే భ్రమరాంబ వచ్చి మాట్లాడుతుుంది. అది ఇందు పైనుంచి చూస్తుంద. తనకు మెస్సెజ్ రావడంతో ఫోన్ చూస్తుంది. వాయిస్ మెస్సెజ్ ఓపెన్ చేస్తే భాను నా మాట వినడం లేదు, మన విషయం మీ ఆయనతో చెప్తా అంటుంది అని ఉంటుంది. అక్కడికి ఆర్య వస్తాడు. డోర్ కొట్టి రావాలని తెలియదా అంటే సారీ చెప్తాడు.
తరువాత సీన్లో ఆర్య, ఆనంద్ దొడ్లసావడలో మాట్లాడుకుంటారు. సంజయ్, వదినకు మధ్య ఏదో ఉందని అని పిస్తుంది. అదే విషయాన్ని భాను కలసి నీతో మాట్లాడుతా అంటుంది అని ఆర్య చేబుతాడు. నా జీవితం కూడా నీలా అయిపోతదని భయంగా ఉంది అని ఆనంద్ అంటాడు. ఇంట్లో ఏదో జరుగుతుందని మాట్లాడుకుంటే అక్కడికి వాళ్ల బావ వస్తాడు. సిగరేట్ ఎక్కువ తాగకండి అని తన సిగరేట్ లాక్కొని తాగుతాడు. ఆనంద్ ఇంట్లోకి వస్తాడు. పూజ గదిలో ఇందుతో తన అత్త మాట్లాడుతుంది. ఇంటికి పెద్దకోడలువు, ఇక్కడి విషయాలు మీ ఇంట్లో చెప్పడం మంచిది కాదు అని చెప్తుంది. ఈ రోజు అమవాస గడియలు మొదలు అవుతాయి. నీ భర్తకు మొఖం చూపించకు అంటుంది. ఈ మాటలను ఆనంద్ వింటాడు. ఇందు బయటకు రాగానే ఈ ఇంట్లో ఏదైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అని చెప్తాడు. ఇష్టమైన వాల్లను వదిలేసి వస్తే ఇబ్బందిగానే ఉంటుంది, నీ చెల్లెలు భర్త పేరు ఏంటి అని అడుగుతాడు. గాయం అయిన కాలు మళ్లీ గాయం అయితే ఇబ్బందిగానే ఉంటుందని తన చెల్లెలు భర్త పేరు సంజయ్ అని చెప్తుంది. ఆనంద్ కోపం తెచ్చకుంటాడు.
తరువాత సీన్లో స్నేహ, ఇందు పడుకొని ఉండగా..తన భర్త ఫోన్ చేస్తాడు. కట్ చేసిన మళ్లీ చేస్తాడు. మాట్లాడు అంటుంది ఇందు. తనలాంటి భర్త దొరకడం అదృష్టం అంటుంది. అక్కడే పడుకోకు త్వరగా రా అని తన భర్త చెప్తాడు. సిగ్గు లేదు ఎవరినో ఊహించుకొని నాతో కాపురం చేయడానికి అంటుంది. అవన్ని కాదు త్వరగా రా, కావాలంటే మీ వదినకు చెప్పు అర్థం చేసుకుంటుందని చెప్తాడు. కట్ చేస్తే మళ్లీ కాల్ చేస్తాడు. ఇందు చూస్తుంది. వెళ్లమంటే నేను వెళ్లను అని చెప్తుంది. లైట్స్ ఆఫ్ చేస్తుంది.
తరువాత సీన్లో ఆనంద్ కు ఫోన్ వస్తుంది. ఆర్య లోపలినుంచి వచ్చి ఈ రోజు నా రూమ్ లేనే పడుకోవాలని అమ్మ చెప్పింది అని అంటాడు. ఆనంద్ కు కాల్స్ వస్తాయి. లిఫ్ట్ చేయి అంటే ఎవరో కాల్ చేస్తున్నారు. మాట్లాడటం లేదు అని నేను డ్రాయింగ్ రూమ్ లో పడుకుంటా అని వెళ్లిపోతాడు. అన్నయ్య ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు అని ఆర్య అనుకుంటాడు. ఇందు మెల్కుంటుంది. టార్చ్ తీసుకొని స్టోర్ రూమ్ కు వెళ్తుంది. అక్కడ పద్మ ఒక్కర్తే పడుకొని ఉంటుంది. తన తల మీద చేయి పెడుతుంది. నన్ను ఏం చేయొద్దు అని పద్మ అరిచి కంగారు పడుతుంది. ఇందు అలానే చూస్తూ ఉంటుంది. అలా అంటూ పద్మ పడుకుంటుంది. ఇంట్లో నుంచి ఒక అరుపు వినిపిస్తుంది. వెంటనే ఇందు బయటకు వచ్చి చూస్తే ఎవరో తన ముందు నుంచే వెళ్తారు. ఇందు షాక్ అయి చూస్తుంది.
నెక్ట్స్ సీన్లో పిల్లలు చదువకుంటారు. ఎవరో చదువు చెప్తుంది. అక్కడికి ఒక కొరియర్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఉమ్మెత్త ఆకు ఉంటుంది. తరువాత సీన్లో స్నేహ దగ్గరకు అందరు వస్తారు. ఎందుకు అరిచావు అని వాళ్ల అమ్మ అడుగుతుంది. ఎవరో తన మొఖం మొత్తం దిండు పెట్టారు అని చెప్తుంది. అదే సమయంలో ఇక్కడ వదిన ఉండాలి కదా అని ఆర్య అంటాడు. తరువాత ఇందును వెతకాలి అని ఆనంద్ బయటకు వస్తాడు. అప్పుడు ఇందు బయట నుంచి లోపలికి వస్తుంది. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్లావు, సంజయ్ ని కలువడానికి వెళ్లావా అని ఆనంద్ అడుగుతాడు. బయటనుంచి ఎవరో వచ్చారు. నేను అడిగే లోపే వెల్లిపోయారు అని చెప్తుంది. అలా జరగడానికి వీలు లేదు అన్ని తలుపులు నేనే వేశాను అని ఆర్య అంటాడు. అయిన స్నేహను ఎవరు చంపబోయారు అని ఆర్య అంటే స్నేహను కాదు వాల్లు ఇందును చంపడానికి వచ్చారు అని వాళ్ల బావ చెప్తాడు. ముందు బయటనుంచి ఎవరు వచ్చారో కనుక్కోవాలి అని అంటారు.
మరో సీన్లో ఆనంద్ ఆలోచిస్తుంటే వాళ్ల బావ కచ్చితంగా వచ్చింది ఇందుకోసమే ఎందుకంటే అది ఇందు రూమ్ అని అంటాడు. స్నేహ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేటప్పడికి తన రూమ్ కు వెళ్లానని బెడ్ పై ఒక్కరే ఉండడం చూసి స్నేహ నా రూమ్ కు వెళ్లింది అననుకున్నా, స్నేహే ఇందు అనుకొని చంపాలని చూశారు అని అంటాడు. అయినా స్నేహ నీ దగ్గరకు ఎందుకు వస్తుంది అని ఆనంద్ అడిగింది. ముందు బయటనుంచి ఇంట్లోకి ఎవరు వచ్చారో కనుక్కోండి అని చెప్పి వెళ్లిపోతాడు.
తెల్లవారుతుంది స్నేహా అద్దంలో చూసుకుంటూ తన చెల్లెలు అన్న మాటలు వినిపిస్తాయి. దాంతో తనకు డౌట్ వచ్చి వాళ్ల అమ్మకు ఫోన్ చేస్తే భాను గొడవపెట్టుకొని ఇంట్లోనుంచి వెళ్లిపోయింది అని చెప్తుంది. దాంతో ఇంట్లోకి వచ్చింది భానునా అని డౌట్ పడుతుంది. తన రూమ్ నుంచి బయటకు రాగానే ఆర్య కనిపిస్తాడు. నిన్న రాత్రి డ్రాయింగ్ రూమ్ లో ఎవరు ఉన్నారు అని అడుగుంది. కట్ చేస్తే ఆనంద్ బాతులకు మేత వేస్తుంటాడు. అక్కడికి ఆర్య వచ్చి రాత్రి జరిగినదాని గురించి ఇప్పుడే వదినతో మాట్లాడి వస్తున్నా అని అంటాడు. తాను పైకి వెళ్లెప్పుడు డ్రాయింగ్ రూమ్ లో లైట్ వెలిగే ఉందని, బయటనుంచి ఇంట్లోకి వచ్చిన వాళ్లకు అక్కడ ఉన్నవాళ్లే హెల్ప్ చేశారని, తరువాత లైట్ ఆఫ్ చేసి ఉందని అదే సమయంలో తను ఆ లేడీని చూసినట్లు చెప్తుంది. ఇక తాను పద్మను చూడడానికే పైకి వెళ్లినట్లు చెప్తుంది.
దాంతో ఆనంద్ కోపంతో వెళ్లిపోతాడు. నువ్వు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నట్లు వదినకు తెలియదు అని నువ్వు నిజాలు దాయకు అని ఆర్య అంటాడు. తరువాత వంటింట్లో కూరగాయలు కోస్తుంటే మీరు నిజంగానే ఎవరినో చూశారా అమ్మ అని పనిమనిషి అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నావు అంటే చిన్న కోడలు లాగానే పెద్ద కోడలు కూడా అని అనుకుంటారు కదా అని పనిమనిషి అంటుంది. ఆర్యకు పెళ్లైందా అని అడిగితే పనిమనిషి వెళ్లిపోతుంది. విషయం చెప్పమంటే చిన్నమ్మగారు ఎవరితోటో కడుపు తెచ్చుకుంది అని చెప్తుంది. అదే సమయంలో అక్కడికి పెద్ద అత్తగారు వచ్చి తన పాత పుస్తకాల షాప్ కు టిఫిన్ పంపించు అని చెప్తుంది.
తరువాత బాజీరావు పరిచయం చేసుకుంటాడు స్నేహ భర్త. మనం ఒక టీమ్ గా ఉంటే స్నేహ మీద ఎటాక్ చేసింది ఎవరో కనిపెట్టొచ్చు అని అంటాడు. అదే సమయంలో ఇందు ఇంటినుంచి సమాన్లు వస్తాయి. ఒక లెటర్ తీసుకొని ఆనంద్ కు ఇస్తాడు పనోడు. దాన్ని ఓపెన్ చేస్తాడు. భాను రాత్రి బయటకు రా భాను రాసి పంపుతుంది. ఆర్య శోభనం గదిని డెకరేట్ చేస్తుంటాడు. ఆనంద్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇందును స్నేహ రెడీ చేస్తుంది. అదే సమయంలో బస్సులో ఇందు పేరెంట్స్ వాళ్లు వస్తారు. ఆనంద్ లేచి వస్తాడు. ఈశ్వరీ ఇందుతో మాట్లాడుతుంది. భాను గురించి అడిగితే తాను రాలేదని చెప్తుంది. అది అలానే అంటుంది వచ్చినా రావచ్చు అని వాళ్ల పిన్ని అంటుంది. తరువాత పూజ స్టార్ట్ అవుతుంది. ఆనంద్ కు ఫోన్ వస్తుంది. అలా వస్తూనే ఉంటాయి. లిఫ్ట్ చేస్తాడు. బస్సులో భాను కోసం వెళ్తాడు. అక్కడ పెళ్లి కార్డు ఉంటుంది. ఇందు వెడ్స్ సంజయ్ ఉంటుంది. దాని వెనుకాల ఇందు సంజయ్ సొంతం వాళ్లను ఎవరు వేరు చేయలేరు అని ఉంటుంది. దాంతో కోపంతో ఆనంద్ గదిలోకి వచ్చి కోప్పడి ఆ కార్డు విసిరేసి వెళ్తాడు. అక్కడే ఉన్న ఆర్య ఏం అయిందని అడిగి లోపలికి వెళ్తే ఇందు ఆ లెటర్ ఇస్తుంది. ఇది వైష్ణవి హ్యండ్ రైటింగ్ అని, తను ఎందుకు రాసిందని అంటాడు. ఇందు షాక్ అవుతుంది.
పిల్లలకు పాఠాలు చెప్పింది వైష్ణవి అని రివీల్ అవుతుంది.
నెక్ట్స్ సీన్లో పోలీసులు ఇంటిని వెతుకుతుంటారు. బుక్స్, వెతుకుతుంటే అక్కడే ఒక అవిడ ఉరిపోసుకొని ఉంటుంది. తరువాత సీన్లో ఈశ్వరికి ఇందు ఫోన్ చేస్తుంది. భానుకు పంపిన వెడ్డింగ్ కార్డు ఫోటో తీసి పంపు అని కట్ చేస్తుంది. తరువాత ఇదంత నా వల్లనే జరిగిందని చెప్తాడు. ఆనంద్ సిగరేట్ తాగుతూ ఆలోచిస్తాడు. కట్ చేస్తే వైష్ణవి నన్ను మోసం చేసింది, ఎవరితోనో ఎఫైర్ పెట్టుకుంది అని ఏడుస్తుంటాడు. నువ్వు ఎమన్నా తక్కువోడివా.. నీకు ఉన్నాయిగా ఎఫైర్స్ అని ఆనంద్ అంటాడు. నాకు ఏ ఎఫైర్స్ లేవు అని ఆర్య అంటాడు. తరువాత పెళ్లికార్డు ఫోటో వస్తుంది. సేమ్ హ్యండ్ రైటింగ్ అని ఆర్య అంటాడు. దీనింతటికి కారణం వైష్ణవి అని అంటాడు. తను తప్పు చేసి మన అందరి జీవితాలను నాశనం చేస్తుంది అని అంటాడు. ఇదంత ఎందుకు అంటే నా మీద కోపంతో చేసిందని అంటాడు. తన అడ్రెస్ ఇవ్వు అంటే వద్దు ఆ నీచురాలి నీడ కూడా నీ మీద పడకూడదు అని అంటాడు. మీ మధ్యలో గొడవలు ఉంటే నన్నెందుకు ఇబ్బంది పెడుతుందని ఇందు అంటుంది. ఇదంత నా వల్లే జరిగింది అని బాధతో మంచాన్ని కొడుతాడు. బాధ పడకు ఆర్య అని తనను పట్టుకొని ఓదారుస్తుంది ఇందు. అదే సమయంలో అక్కడికి ఆనంద్ వస్తాడు. అది చూసి తప్పుగా అర్థం చేసుకుంటాడు. నీకు ఎఫైర్స్ లేవంటే నేను నమ్మను అని ఆనంద్ కు గుర్తుకు వస్తుంది. అక్కడినుంచి వెల్లిపోతాడు.
తరువాత సీన్లో పద్మ రూమ్ లో కాంక్రోచ్ వస్తుంది. దాన్ని చూసి భయంతో అరుస్తుంది అది వెళ్లిపోవడాన్ని చూస్తుంది. మీ వదిన వైష్ణవి గురించి ఎంక్వైరీ చేస్తుందంటా అని బాజీరావు స్నేహతో అడుగుతాడు. వైష్ణవి చర్చ ఇంట్లో మళ్లీ వచ్చింది అని పెద్దమ్మ తన భర్తతో అంటుంది. పద్మ కాంక్రోచ్ దగ్గరకు వెళ్తుంది. నీకు భయం అవుతుందా అని బాజీరావు అంటాడు. ఈ ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండడం తప్పా ఏం చేయలేము అని పెద్దయ్య అంటాడు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది అని పద్మ కాంక్రోచ్ తో అంటుంది. మరో సీన్లో ఆర్య ఏదో పని చేస్తుంటే వాళ్ల అమ్మ వచ్చి ఇందుకు వైష్ణవి అడ్రస్ తెలియకూడదు అని అంటుంది. ఇప్పటికే నీ మీద ఇందు మీద నింద వేశారు అని అంటుంది. ఒక వేళా తెలిస్తే అంటే తెలియకుంటా నేను చూసుకుంటా అని అంటుంది. తరువాత సీన్లో బాతులను చూస్తూ ఇందు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. వైష్ణవి అడ్రస్ ఆర్య రూమ్ లో దొరుకుతుంది అని పనిమనిషి చెప్తుంది. దాంతో వెంటనే రూమ్ లో వెతుకుతుంది. పనిమనిషి బయట నిలబడి ఉంటుంది. అది చూసిన భ్రమరాంబ పైకి వస్తుంది. ఇంకెండుందుకు ఉన్నావు అని, ఆ గడి ఎవరు తెరిచారు అని అడుగుతుంది. తాను కంగారు పడుతూ ఎవరు లేరు అని చెప్తుంది. దాంతో భ్రమరాంబ డోర్ పెట్టి వెళ్తుంది. పని మనిషి డోర్ తీసి వెళ్లిపో అంటుంది. తాను అడ్రెస్ తీసుకొని బయటకు వెళ్తుంది. పాప బయటకు వస్తుంది. తరువాత బాజీరావు పైనుంచి చూస్తాడు. ఇందు బయటకు వెళ్లి ఆటో ఎక్కుతుంది. వైష్ణవి కనిపిస్తుంది. తనను పలకరించే లోపే వైష్ణవి కనిపిస్తుంది. తరువాత వెళ్లిపోతుంది. ఆటో ఎక్కి వైష్ణవ్ ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో పద్మతో ఆనంద్ మాట్లాడుతుంటాడు. నువ్వు అనుకున్నదే జరుగుతుంది అని ఇప్పుడు సంతోషమే కదా అని అంటాడు. ఇక మీద ఊరుకునేది లేదు అని అరుస్తాడు. అక్కడికి ఆర్య వచ్చి వదిన ఎక్కడికి వెళ్లింది అని అడుగుతాడు. తను ఎక్కడికి వెళ్లిందో నీకే తెలుసు ఎందుకంటే నా ప్లేస్ లో ఫస్ట్ నైట్ రోజు నువ్వున్నావు కదా అని అరిచి వెళ్లిపోతాడు.
మరో సీన్లో భ్రమరాంబ మేడమీద కూర్చొని తన అక్కతో మాట్లాడుతుంది. ఒక కోడలేమో అట్లా అయితే ఇందు ఏమో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది అని అంటుండగా అక్కడికి నీల్లు తీసుకొని పని మనిషి వస్తుంది. ఆనంద్ ఎక్కడా అంటే ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు అంటుంది. ఆనంద్ భానుతో మాట్లాడుతాడు. నీ వైఫ్ నా భర్త జోలికి రాకుండా చూసుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అలాగే సంజయ్ కి ఇందుకు పెళ్లికాలేదని చెప్తుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆర్య ఆ రోజు నైట్ ఇంటికి వచ్చావా లేదు అని చెప్పి వెళ్తుంది. దాంతో ఆర్యకు ఒక డౌట్ క్లారీఫై అవుతుంది. ఆనంద్ దగ్గరకు వాళ్ల అమ్మ వచ్చి తనతో ఏం మాటలు అని అంటుంది. ఆర్య వచ్చి మొన్న రాత్రి మన ఇంటికి వచ్చింది భాను కాదు, నీ గదికి వచ్చిన అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. ఆనంద్ అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఆర్య అలానే చూస్తాడు.
తరువాత సీన్లో పద్మతో ఇందు ఆంటీ మంచిది అని తన కూతురు చెప్తుంది. నీకు మంచిది అని పించిందంటే ఇందు మంచిదే కానీ మంచి వాళ్లు చనిపోతారు అని అంటుంది. తరువాత సీన్లో ఇంటికి పోలీసులు వస్తారు. పనిమనిషిని పిలచి ఇంట్లో వాళ్లను పిలవండి అని అంటాడు. అందరు వస్తారు. అక్కడికి ఇందు కూడా వస్తుంది. వైష్ణవి చనిపోయిందని సూసైడ్ లా అని పిస్తుంది. బాడీ మార్చురీలో ఉందని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు.
ఫోన్ మోగుతుంది. ఒక అతను లిఫ్ట్ చేస్తాడు. లైబ్రరీలో ఉండే వరు అందరూ లేచి పైకి చూస్తారు. బుక్స్ కింద పడుతుంటాయి. అందరు షాక్ అవుతారు. పాయిజనెస్ ప్లాంట్స్ ఆఫ్ ఇండియా అనే బుక్ ఉంటుంది. తరువాత సీన్లో పోలీసులు మ్యార్చురీ దగ్గరకు తీసుకెళ్తే ఆర్య చూడకుండా వెళ్లిపోతాడు. వాళ్లతో వచ్చిన పెద్దనాన్న, పెద్దఅమ్మ చూస్తారు. తరువాత ఇంట్లో పనిమనిషి వైష్ణవిని తలుచుకొని ఏడుస్తుంది. మేమే ఏడవట్లేదు నువ్వు ఏడ్వడం ఏంటి దీని ఏడుపు ఏదో అనుమానంగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపో అంటుంది. తరువాత సీన్లో ఇంత దూరం వచ్చి చూడకపోవడం ఏంటి అని ఇందు ఆర్యను అడుగుతుంది. దాంతో ఒకప్పుడు వైష్ణవి మీద ఎంతో ప్రేమ ఉందని ఇప్పుడు ద్వేషం ఉందని చెప్తాడు. అలాంటప్పడు తన బట్టలు, నగలు నీ కబోర్డులో ఎందుకు దాచుకున్నావు అని అడుగుతుంది. తనది సూసైడ్ అయి ఉండదు, తాను ఏ తప్పు చేసుండదు అని ఇందు అంటుంది. ఆర్య ఆలోచనలో పడుతాడు.
పద్మరూమ్ లో పెద్దమ్మ, పెద్దయ్య కూర్చొని ఉంటారు. వైష్ణవి కోసం ఎవరు ఎడవద్దు తనకోసం ఏడిచేవాళ్లను శత్రువుల్లా చూస్తారు అని చెప్తాడు. కట్ చేస్తే ఇందు చాయ తాగుతుంటే భ్రమరాంబ, స్నేహ వచ్చి ఈ ఇంటికి కొన్ని పద్దతులు ఉన్నాయి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లిరావడానికి ఇది సత్రం కాదు అంటుంది. ఇంటి కోడలు చనిపోతే చూడడానికి రాని మీరు పద్దతుల గురించి మాట్లాడొద్దు అని అంటుంది. తన గురించి ఈ ఇంట్లో మాట్లాడొద్దు, చిన్న కొడుకు జీవితాన్ని ఆగం చేసింది అని అత్త అంటుంది. అయితే తాను నన్నెందుకు చంపాలనుకుంటుంది అని ఇందు అడుగుతుంది. తనను ఇంట్లో నుంచి పంపింది ఆర్య కాదు ఆనంద్ అని బాజీరాజ్ చెప్తాడు. అక్కడినుంచి అత్తా, స్నేహ వెళ్లిపోతుంది. వైష్ణవి ఆర్యల గొడవకు కారణం ఏంటి అని అడిగితే, నువ్వు నా టీమ్ కాదు నేడు డెవిల్ ట్రంపెట్ ని అని వెళ్లిపోతాడు. దాంతో ఇందు ఇంట్లోకి వచ్చి డెవిల్ ట్రంపెట్ గూగుల్ చేస్తుంది. ఉమ్మెత్త పువ్వు వస్తుంది. ఆటో ఎక్కుతుంటే వైష్ణవి కనిపించి. తాను మొన్నే చనిపోయింది కదా అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తుండగా.. అక్కడి ఆనంద్ వచ్చి బట్టలు తీసుకొని వెళ్తుంటాడు. ఇది మీ రూము మీరు ఉండండి నేనే వేరే రూమ్ కు వెళ్తా అంటుంది. ఎక్కడికి ఆర్య రూమ్ కా అని ఆనంద్ అంటాడు. సంజయ్ ను అనుమానించడం అయిపోయింది, ఇప్పుడు ఆర్యను అనుమానిస్తున్నావా అంటుంది.
తరువాత బాడీని పోస్ట్ మార్టం రూమ్ కు తీసుకెళ్తారు. బయటకు వెళ్లడానికి రెడీ అవుతుంటే అత్త చూస్తుంది. ఇదే విషయాన్ని తన కొడుకుతో చెప్తుంది. తాను కొప్పడుతుండగా… ఇందు బయటకు వచ్చి పనిమీద బయటకు వెళ్తున్నా అని చెప్తుంది. ఆర్య గురించి అడిగి బుక్ షాక్ కు వెళ్తుంది. తరువాత ఆర్య పోలీసు స్టేషన్ కు వెళ్తాడు. అక్కడ వెయిట్ చేస్తుంటాడు. ఇందు బుక్ షాప్ కు వెళ్తుంది. అక్కడ ఉమ్మెత్త పువ్వు గురించి ఉన్న బుక్ కావాలి అంటుంది. పోలీసు స్టేషన్ లో ఎస్ఐ తో ఆర్య మాట్లాడుతుంటాడు. తన వైఫ్ నుంచి వచ్చిన లాస్ట్ మెస్సెజ్ వినిపిస్తాడు. అందులో తన బిడ్డకు దూరం కావడం ఇష్టం లేదని ఉంటుంది. తనను ఎవరో దిండు పెట్టి చంపి, తరువాత ఉరి వేశారని చెప్తాడు. తన కడుపులో ఉమ్మెత్త ఆకు విషం ఉందని చెప్తాడు. మరో వైపు పాయిజనెస్ ప్లాంట్స్ ఆఫ్ ఇండియా బుక్ ను ఇస్తాడు. దాన్ని ఇందు చదువుతుంది. ఆర్య స్టేషన్ బయటకు వచ్చి నిల్చుంటాడు.
వైష్ణవిది సూసైడ్ కాదంటా మర్డర్ అని ఆర్య చెప్తాడు. పోలీసులు ఎంక్వైరీకి పిలుస్తారని చెప్తాడు. అందరు షాక్ అవుతారు. ఆర్య లేచి వెళ్లిపోతాడు. అందరు వెళ్లిపోతారు. ఆర్య బయటకు వచ్చి వైష్ణవిని చూస్తాడు. పద్మకు నెత్తి దువ్వుతున్నట్లు కలగంటాడు. ఇందు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఒక అవిడా కనిపిస్తుంది. ఇందును చూసి ఆవిడ వెళ్లిపోతుంది. తన వెనుకాలే ఇందు వెళ్తుంది. ఒక ఇంటికి వెళ్తుంది. గేటు తీసుకొని ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడుతుంది. ఒక ఆవిడ డోర్ తీస్తుంది. ఇంట్లోకి ఒక అమ్మాయి వచ్చిందా అంటే లేదు అంటుంది. దాంతో వైష్ణవి పేరు చెప్పగానే తాను మీకు తెలుసా అని అవిడ అడుగుతుంది. తరువాత కెమెరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా అని ఎస్ఐ అడుగుతాడు. వైష్ణవిని ఎలాగు తిరిగి తీసుకురాలేము కనీసం అలా చేసిన వాళ్లకు అయిన శిక్షపడాలి కదా అంటాడు.
తరువాత సీన్లో ఇందుతో తాను హస్టల్ వాడెన్ ను అని, రెండు నెలలుగా మా హస్టళ్లోనే ఉంటుందని, లైబ్రరీ నడిపే అతనే పరిచయం చేసినట్లు చెప్తుంది. తాను మంచి అమ్మాయి అంటుంది. మరో సీన్లో పోలీసు స్టేషన్ కు ఆర్య ఫ్యామిలీ వస్తారు. కాసేపు వెయిట్ చేయమంటే భ్రమరాంబ పోలీసు స్టేషన్లో వెయిట్ చేయాలా అని చికాగు పడుతుంది. తరువాత సీన్లో తన రూమ్ చూస్తుంది ఇందు. తన ఫోటో చూస్తుంది. మరో సీన్లో ఆనంద్ ను ఎక్వైరీకి రమ్మన్నాడని ఆర్య చెప్తాడు. తురువాత ఇందు ఇంటికి వెళ్తే అందరూ పోలీసు స్టేషన్ కు పోయారని పనిమనిషి చెప్తాడు. ఇన్విస్టిగేషన్ జరుగుతుంది. ఒక రోజు ఆర్య, వైష్ణవి గొడవ పడుతుంటే అక్కడికి ఆనంద్ వచ్చి ఏంటి గొడవ అని ఆర్యను మందలిస్తాడు.వైష్ణవి ప్రెగ్నెంట్ అని తెలసి ఆర్య తిడుతాడు. మీకు వైష్ణవికి మధ్య ఫిజికల్ రిలేషన్ షిప్ ఎందుకు లేదని పోలీసు అడుగుతాడు. బిజినెస్ పని మీద నెలకు ఒక్క రోజే ఇంటికి వెళ్లేది అని ఆర్య చెప్తాడు. అక్కడికి ఇందు వస్తుంది. ఆర్యతో మాట్లాడాలి అని చెప్తుంది. వైష్ణవిని ఇంటినుంచి బయటకు పంపించావు తరువాత హస్టల్లో నువ్వే చేర్పించావు. ఉమ్మెత్త ఆకును పనస కాయలో పెట్టావు, సూదిని గిఫ్ట్ గా పంపించావు. పెల్లెం నీళ్లలో కారం కలిపావు. ఎందుకు చేశావు అని అడుగుంది. ఇవన్ని నేను చేశానని ఆధారం ఉందా అంటాడు. అన్ని త్వరలోనే బయటకు వస్తాయి అని ఇందు అంటుంది.
తరువాత పోలీసు వీళ్లను వెళ్లిపో అంటాడు. ఒక్కరి ఫేస్ లో కూడా ఎక్స్ ప్రెషన్ లేదు. ఇలాంటి మిస్టిరీయస్ ఫ్యామిలీని ఎక్కడ చూడలేదు అని చెప్తాడు. స్టేషన్ నుంచి అందరు గొడుగులు పెట్టుకొని వస్తారు. అక్కడ కారు ఆగుతుంది. గ్లాస్ కిందికి దిగుతుంది. అందరూ షాక్ అయి చూస్తారు. ఆర్య నిలబడి బయటకు చూస్తూ ఉంటాడు. అక్కడికి ఇందు వస్తుంది. కారు గ్లాస్ పైకి వెళ్తుంది. ఇందు కూడా షాక్ అవుతుంది. ఇది వధువు వెబ్ సిరీస్ మూవీ ఎక్స్ ప్లనేషన్.