Mansion 24: ఓపెన్ చేస్తే ఒక పోల్ పై ఉన్న కాకి అరుస్తు ఎగిరిపోతుంది. టాప్ యాంగిల్ నుంచి మరో సీన్లో నెలపై ఒక లేడి పడిపోయి ఉంటుంది, పక్కనే పెద్ద సుత్తే ఉంటుంది. ప్రాణపాయ స్థితిలో ఉన్న ఆ లేడీ.. తన పేరు అమృతా, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనే వాయిస్ ఓవర్ తో తన కథ చెబుతుంది. ఈ ప్రపంచలో నిజం, అబద్దం రెండూ ఒకదానికొకటి అల్లుకుపోయి ఉంటాయని, తాను ఈ మాన్షన్ కు వచ్చింది నిజాన్నో, అబద్దాన్నో వెతుక్కుంటూ కాదు.. అజ్ఙాతంలో కలిసిపోయే ఒక రహస్యాన్ని వెతుక్కుంటూ.. ఇప్పుడు నాతో పాటే ఆ రహస్యం కూడా గాల్లో కలిసిపోబోతుంది అంటూ… ఆ రహస్యం ఏంటో అనే అంశంపై ఆసక్తిని పెంచుతుంది. మాన్షెన్ 24 సిరీస్ టైటిల్ పడుతుంది.
చదవండి:Shivaji: టాస్క్‌లో ఓడిన పెద్ద మనిషి.. సంచాలక్‌పై అరుపులు
కాళిదాసు ఆర్కియాలజి డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తి. కాళిదాసు ఎంతో విలువైన జాతీయ ఆస్తులను, విలువైన సంపదతో పరార్ అయ్యాడు. ఆర్కియాలజి లాయర్ సూర్యప్రకాశ్ స్పందించలేదు అని న్యూస్ ఛానెళ్లు చెబుతుంటాయి. ఆసుపత్రిలో ఉన్న అమృత తల్లి ఆ న్యూస్ చూస్తుంది. అక్కడికి నర్సు, డాక్టర్ ఇద్దరు వస్తారు. సావిత్రి పల్స్ చెక్ చేసి.. అమృత ఎక్కడా అని అంటుంది డాక్టర్… అమృత తన ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటుంది. ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ గురించి రీసెర్చ్ చేస్తుంది. తన పక్కనే ఉన్న ఫ్యామిలీ ఫోటోను చూస్తూ ఆలోచిస్తుంది. తరువాత అక్కడికి జర్నలిస్ట్ లు వస్తారు. వాళ్ల నాన్న కాళిదాసు గురించి వస్తున్న అభియోగాలను అడుగుతారు. మీ నాన్న కొట్టేసిన నిధి వ్యాల్యూ ఎంతా..? టెర్రరిస్ట్‌లతో సంబంధాలు ఉన్నాయా.? అనే ప్రశ్నలు అడుగుతారు. కాళిదాసు దేశద్రోహి కాదని, అతను ఒక నిజాయితీ పరుడుని.. అది నిరుపిస్తా అని జర్నలిస్ట్‌లతో చెప్తుంది అమృత. అక్కడినుంచి ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కు ఆటోలో వెళ్తుంది. వాళ్ల నాన్న కాళిదాసు ఫోటోను చూపించి అడుగుతుంది. అక్కడ కాళిదాసు మాన్షన్ దగ్గర ఏదో వెతుకుతూ ఉన్న మాంటేజ్ షాట్ చూపిస్తారు. అక్కడి నుంచి లాయర్ సూర్యప్రకాశ్ ను కలుస్తుంది. తనతో మాట్లాడుతుంది.
తరువాత సీన్లో అమృత దిగులుగా ఆలోచిస్తుంది. చాయ్ తాగుతూ వాళ్ల నాన్న ఫోటోను పేపర్లో చూసి బాధపడుతుంది. తరువాత ఆసుపత్రికి వెళ్లి తన తల్లిని చూస్తుంది. డాక్టర్ తో మాట్లాడితుంది. తాను ట్రీట్మెంట్కు రెస్పాన్స్ అవడం లేదని ఇంటికి తీసుకెళ్లిపోవడం బెటర్ అని డాక్టర్ చెప్తుంది. దానికి బదులుగు అమ్మ మాములు మనిషి కావాలంటే వాళ్లనాన్నను వెతుకాలని అమృత డాక్టర్ తో చెప్తుంది. అక్కడినుంచి ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జయప్రకాశ్ ను కలుస్తుంది. ఈ నెల 12 తారీఖునుంచి కాళిదాసు మిస్ అయ్యాడు అని అమృత అంటుంది. దానికి జయప్రకాశ్ పారిపోయి ఉంటాడు అని, తన గురించి తప్పుగా మాట్లాడుతాడు. అలా ఎలా మాట్లాడుతారు అని అమృతా అంటూ కాళిదాసు వర్క్ పని మీద చివరిగా వెళ్లింది పాడుబడ్డ మాన్షెన్ కు అంటుంది. జయప్రకాశ్ భయంగా అమృతను చూస్తూ నీకు ఎవరు చెప్పారు. ఆర్కియాలజి డిపార్ట్మెంట్ కు మాన్షేన్ కు ఏంటి సంబంధం అని, ఎవరి మాటలో నమ్మి నువ్వు అక్కడి వెళ్లకు అని జయప్రకాశ్ అంటాడు.
తరువాత సీన్లో పోలీసులతో ఇదే విషయాన్ని చెబుతుంది అమృత. అది వినీ ఎస్ఐ భైరవ కూడా భయపడుతాడు. మేమంతా విలువైన వస్తువుతో కాళిదాసు పారిపోయాడు అని అనుకుంటుంటే నీవేమో దెయ్యాల మాన్షెన్ కు వెళ్లాడు అని కట్టుకథలు చెబుుతున్నావా.. అది నిజమే అయితే ఇక మీ నాన్నను వెతాకాల్సిన అవసరం లేదని అంటాడు. దాంతో అమృత పోలీసు స్టేషన్ నుంచి బయటకు రాగానే ఒక కానిస్టేబుల్ వచ్చి ఆ మాన్షెన్ తనకు తెలుసు అని చెప్తాడు. ఊరికి ఉత్తరాన ఎత్తైన కొండపైన 6 అంతుస్తుల నరకం అని, దాని కంటపడినా, దాని నీడ పడినా చావు వెంటాడుతుంది అని చెప్తాడు. అక్కడకి అడుగుపెట్టిన వారెవ్వరు ప్రాణాలతో తిరిగి రాలేదు.. నువ్వు జాగ్రత్త అని చెప్తాడు. దాంతో అమృత భయంతో చూస్తుంది. కట్ చేస్తే మాన్షెన్ దగ్గరకు ఆటోలో వెళ్తుంది. బయట నిలబడి మాన్షన్ ను చూస్తుంది. తన బ్యాగ్ నుంచి కెమెరా తీయగానే ఒక కాకి అరుపు వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక చిన్న గుడి కనిపిస్తుంది. అక్కడి వెళ్లి ఫోటోలు తీస్తుంది. అలా పైకి లేవగానే ఒక బొమ్మకు ఉరి వేసి కిందకు వెలాడపడి కనిపిస్తుంది. ఒక్క సారిగా అమృత భయపడుతుంది. అంతలోనే ఒక కాకి వింతగా అరుస్తుంది. అటు వైపు తిరిగి చూస్తుంది. అలా వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడో ఇళ్లు కనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్తుంది. వెనకనుంచి ఏదో వెళ్లినట్లు అనిపిస్తుంది. అంతలో ఎవరు అని వాచ్ మెన్ అడుగుతాడు. తాను ఒక ఇన్వెష్టిగేటీవ్ జర్నలిస్ట్ అని మాన్షన్ గురించి ఆర్టికల్ రాయలని ఇక్కిడికి వచ్చినట్లు చెప్తుంది.
ఆడపిల్లవి, ఒంటరిగా వచ్చావు ఏం తెలుసుకుంటావు అని అడుగుతాడు. ఈ మాన్షన్ గురించి చాలా కథలు వినిపిస్తున్నాయి అవి అన్ని కట్టుకథలు అని, నిజాలు ప్రజలకు తెలియజేయాలి అంటుంది. దానికి వాచ్ మెన్ బదులిస్తూ.. తెలుసుకుందామని ఇక్కడి వరకు వచ్చావు లోపలికెళ్లి బయటకు వస్తే అవి కట్టు కథలు, లేదంటే నువ్వే ఒక కథ అయిపోతావు అంటాడు. దానికి నువ్వు రైటర్ లా మాట్లాడుతున్నావు అని అమృత అంటుంది. తాను ఒక రైటర్ గురించి చెప్తాడు.. రూమ్ నెంబర్ 504 టైటిల్ పడుతుంది.
అందులో రైటర్ చత్రువేది ఏదో టైప్ చేస్తూ.. రాసింది తనకు నచ్చక వాటిని చుట్టచుట్టి పడెస్తాడు. తరువాత రెండు పెగ్ లు వేసుకుందామని ఆలోచిస్తుండగా తాను పడేసిన పేపర్ కదులుస్తుంది. తరువాత పెగ్ ఫిక్స్ చేసుకొని తాగుదాం అనేలోపు లైట్స్ ఆఫ్ అవుతాయి. చత్రవేది భయపడుతాడు. లైట్స్ ఆన్ అవుతాయి అంతలో అతనికి తన భార్య ఫోన్ చేస్తుంది. తనతో మాట్లాడుతుండగా టైప్ రైటర్ టైపు చేస్తుంది. 404లో పిల్లలు ఉన్నారు జాగ్రత్తా అని టైప్ చేస్తుంది. అంతలో లైట్స్ మళ్లీ ఆఫ్ అవుతాయి.. ఒక టార్చీ తీసుకొని చత్రువేది అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. మళ్లీ టైప్ రైటర్ టైప్ చేస్తుంది. ఒక్కసారిగా భయపడుతాడు.
కట్ చేస్తే రైటర్ తలనొప్పిగా ఉందని మెడికల్ షాప్ కు వెళ్తాడు. అక్కడ స్వప్న ఉంటుంది. అంతలో అక్కడికి లిల్లి వచ్చి టాబ్లెట్స్ అడుగుతాడు. అవి లేవని అనేసరికి అతను వెళ్లిపోతాడు. తరువాత చత్రువేది టాబ్లెట్స్ తీసుకొని చేంజ్ తీసుకోకండా తన రూమ్ కు వెళ్లిపోతాడు.
టాబ్లెట్స్ టేబుల్ మీద పెట్టినప్పుడు టైప్ రైటర్ ఉంటుంది. నీళ్లు తాగేప్పుడు అది అక్కడ ఉండదు. దాంతో భయపడుతాడు. డోర్ ఓపెన్ అయింది అని దాన్ని క్లోజ్ చేయడానికి వెళ్తే ఒక షూ కనిపిస్తుంది. దాన్నిపట్టుకొని చూస్తుండగా.. టైప్ రైటర్ తన వెనక కింద పడుతుంది. అది మళ్లీ టైప్ చేస్తుంది. ఈ రోజు నీకు చివరి రాత్రి అని టైప్ అవుతుంది. అటు చూడాగానే పిల్లలు ఇద్దరు పరుగెడుతుంటారు. ఎవర్రా మీరు అని అనుకుంటూ.. 404 రూమ్ కు వెళ్లి డోర్ ను కొడుతూ పిల్లలను పిలుస్తూ ఉంటాడు. అంతలో పక్కనే ఉన్న ఒక ఆవిడ వచ్చి చత్రువేదిపై అరుస్తుంది. పిల్లుకాదు మీరు దెయ్యాలు అనుకుంటూ ఇంటి బయటన ఉన్న షూ ర్యాక్ ను చూస్తే అందులో చాలా షూలు ఉంటాయి. వాటిని ఒక పేపర్లో కట్టి బయటపడేస్తుండగా అక్కడికి ఒక బైరాగి వస్తాడు. చత్రువేది వెనక్కి తిరగ్గానే అతన్ని చూసి భయపడుతాడు. ఆత్మల గురించి తాను ఏదో చెప్తుంటే తనను తిట్టి వెళ్లిపోతాడు చత్రువేది. తరువాత ఆ వ్యక్తి 404 రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ను చూస్తూ ఆత్మ శాశ్వతమైనది అని చెప్తాడు బైరాగి. మెళ్లిగా డోర్ ఓపెన్ అవుతుంది. ముగ్గురు పిల్లలు అటు నిలబడి ఉంటారు. వారిని చూసి వెర్రిగా నవ్వుతాడు. నైట్ అవుతుంది. చత్రువేది రూమ్ లో పడుకొని ఉంటాడు. ఏదో సౌండ్స్ వినిపించి మెలుకువ వస్తుంది. లేచి చూస్తే తాను పడేసిన షూ బ్యాగ్స్ తన రూమ్ లో కనిపిస్తాయి.. వాటిని చూస్తూ ఆలోచిస్తుండగా.. డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. డోర్ సందులోంచి చూస్తే ముగ్గరు పిల్లలు అటు తిరిగి నిలబడి ఉంటారు. ఒక పిల్లాడు మాత్రం డోర్ వైపు తిరుగుతాడు. అతని కనుగుడ్లు, ముఖం వికృతంగా ఉంటుంది.. అది చూసి భయపడి వెనక్కి ఎగిరి పడుతాడు. అక్కడ షూ ఉంటుంది. కట్ చేస్తే చాలా మంది పిల్లలు అతని రూమ్ లోకి వస్తారు. వాళ్లను చూసి భయపడుతాడు. పైనుంచి ఒక అందమైన అమ్మాయి మెడకు ఉరి తాడు వేసుకొని కిందికి దిగుతుంది. చత్రుదేది అలానే చూస్తాడు. డోర్ బైయట బోర్డు చత్రువేది అవుట్ అని మారుతుంది.
ఇదే విషయాన్ని అమృతకు వాచ్ మెన్ చెప్తుంటాడు. తరువాత పిల్లల షూతో, తన చెప్పులు కలిసిపోయి ఉంటాయి. దీంతో అప్పటినుంచి చత్రువేది కనిపించలేదని చెప్తాడు. కనిపించకుండా పోయినంత మాత్రనా చనిపోయినట్లా అని అమృత అంటుంది. ఇంకా దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా అని అడుగుతుంది. అది చెప్తే అర్థం కాదు, అనుభవంతో చెప్తున్నా.. ఒక్కసారి నమ్మిన తరువాత మళ్లీ నీడను కూడా నమ్మవు అని వాచ్ మెన్ అంటాడు. చీకటి అయింది ఇక్కడ ఉండడం అంత మంచిది కాదని వెళ్లిపో అని చెప్తాడు. అమృత లేచి బయటకు వెళ్తుంది. తాను కూర్చున్న టేబుల్ కింద పిల్లల రెండు షూలు ఉంటాయి. ఎపిసోడ్ ముగుస్తుంది.
అమృత పడుకొని ఉంటుంది. ఇంటెన్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కెమెరా మెల్లిగా టిల్ట్ డౌన్ అవుతుంది. కింద షూలు కనిపిస్తాయి. తాను లేచి గోడవైపు చూడగానే ఒక పిల్లోడు కనిపిస్తాడు.. కళ్లు నలుచుకొని చూస్తే అక్కడ ఎవరు ఉండరు.. ఒక్కసారిగా మరో అబ్బాయి తన ఫేస్ మీదకు వస్తాడు. ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది. అంతలో ఏదో కిందపడిన సౌండ్ వినిపిస్తుంది. వెళ్లి చూస్తే ఒక నల్ల పిల్లి తన తల్లి బెడ్ మీద ఉంటుంది. దాన్ని వెళ్లగొడుతుంది. దగ్గరకి వెళ్లి తల్లితో మాట్లాడుతుంది. నాన్నా గురించే ఆలోచించే ఇలా అయ్యావు.. ఆ మాన్షన్ కు వెళ్లాలని ఉందని, కాని తనకు ఏదైనా అయితే నువ్వు ఒంటిరివి అవుతావు అని బాధ పడుతుంది.
మళ్లీ మాన్షన్ దగ్గరకు వెళ్తుంది. రికార్డు చేసుకుంటుంది. వాచ్ మెన్ చెప్తుంటాడు. ఈ సారి 203లోని ఒక అమ్మాయి కథను చెప్తాడు.
రేడియోలో ఏడేళ్ల కొడుకును, భార్యను చంపిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్తుంటారు. ఒక అమ్మాయి స్నానం చేసుకొని వచ్చి, హెయిర్ డ్రై చేసుకుంటుంటే ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే తల్లి.. భాయ్ ఫ్రెండ్‌తో ఉంటున్నావా అని, మోస పోయిన తరువాత ఆలోచిస్తే లాభం లేదు అని మాట్లాడుతుంది. నేను నీలా మోసపోయి ఏడుస్తూ కూర్చొను.. అనుకున్నది సాధించేందుకు ఎంత దూరం అయినా వెళ్తా అని తల్లితో అంటుంది స్వప్న. తరువాత టైమ్ అయిందని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
తరువాత సీన్లో మెడికల్ షాప్‌లో పనిచేస్తుండగా అక్కడికి చత్రువేది వచ్చి డాబ్లేట్స్ అడగడం.. అక్కడికి లిల్లీ రావడం.. జరుగుంది. పక్కనే తన కొలిగ్ రాధా స్వప్న అంటూ పైకి లేచి తనను భయపేడుతుంది. తాను టాబ్లెట్ వాడుతున్నట్లు, అయినా పెళ్లి అయినవాడితో నీకేంటి అని తన రాధా అంటుంది. అంతలో తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. పక్కకు వచ్చి మాట్లాడుతుంది. ఆ సమయంలో షాపులోకి అప్పుడే రాధా వస్తుంది. అది చూసి అదేంటి నువ్వు ఇప్పుడు వస్తున్నావా.. ఇంత ముందు నాతో మాట్లాడింది ఎవరు అని ఆలోచిస్తుంది స్వప్న.
తరువాత సీన్లో తన ప్లాట్‌లో బుక్ చదువుతూ ఉండగా.. బెల్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. డోర్ నుంచి చూస్తే తన బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. తడిసిపోయి ఉంటాడు. మన మ్యాటర్ ఇంట్లో నా వైఫ్‌కు తెలిసిపోయింది అని చెప్తాడు. నీ వైఫ్ కు డివోర్స్ ఎప్పుడు ఇస్తావు అని స్వప్న అంటుంది. అది అంత ఈజీ కాదు అని అంటాడు. అయితే దానికి ఒకే మార్గం ఉందని అంటుంది. అది కరెక్ట్ కాదని అంటాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటా అని ఈ విషయం ఎవరకి చెప్పద్దు అని అంటాడు. దానికి స్వప్న ఓకే అంటుంది.
నెక్ట్స్ సీన్లో ఇద్దరు నిద్రపోతుండుగా డోర్ ఓపెన్ అవుతుంది. స్వప్నకు మెలుకువ వస్తుంది. బేబీ బేబీ అంటూ తన బాయ్ ఫ్రెండ్ ను లేపడానికి ట్రై చేస్తుంది. తాను లేవడు. ఇంటి ముందు నుంచి ఎవరో వెళ్లినట్లు అనిపిస్తుంది. వెంటనే బయడపడి టాబ్లెట్ తీసుకొని వేసుకుంటుంది. బయటకు వస్తుంది. అక్కడ ఒక పర్సన్ నీడ కనిపిస్తుంది. ఒక్కసారిగా భయపడుతుంది. బాత్రూమ్ ను ఓపెన్ చేస్తుంది. అక్కడ కూడా తన రూమ్ లో ఉన్న రేడియో ఉంటుంది. బాత్ టబ్ పై కూర్చుంటింది. వెనకనుంచి ఎవరో చేయి వేసినట్లు అనిపించి భయపడుతుంది. కట్ చేస్తే తాను మెడికల్ షాప్ కు రెడీ అయి వెళ్లిపోతుంది. అక్కడ పోలీసులు ఉంటారు తన బాయ్ ఫ్రెండ్ ఫోటోను చూపించి ఇతను మీకు తెలుసా అని అడుగుతారు. ఏం జరిగింది అని స్వప్న అంటుంది. తన ఏడెళ్ల కొడుకును, భార్యను చంపి పారిపోయాడు అని, కనిపిస్తే ఇన్ఫామ్ చేయండి అని చెప్తారు. స్వప్న షాక్ లో ఉంటుది.
వెంటనే మాన్షెన్ కు వెళ్తుంది. రేడిలో ఏడేళ్ల కొడుకును, భార్యను చంపిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్తారు. స్వప్న లోపలికి వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ స్నానం చేస్తుంటాడు. బేబీ నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పొద్దు అని అంటుంటాడు. తన బట్టలకు రక్తం మరకలు ఉంటాయి. వాటిని తీసుకొని స్వప్న తన సూట్ కేసులో పెడుతూ తొందరగా మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అంటుంది. తాను మాత్రం బేబీ నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పొద్దు అని అంటుంటాడు. పోలీసులు వాహనాల సౌండ్ వినిపిస్తుంది. స్వప్న అన్ని సర్థుతుంది. అంతలో స్వప్నకు ఫోన్ వస్తుంది. తన తల్లి ఏదో మాట్లాడుతుంటే తరువాత మాట్లాడుతా అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పటి వరకు స్నానం చేస్తున్న తన బాయ్ ఫ్రెండ్ డ్యాన్స్ చేస్తుంటాడు. తను షాక్ లో ఉంటుంది. అంతలో డోర్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. వెళ్లి చూస్తే తన బాయ్ ఫ్రెండ్ కనిపిస్తాడు. అది చూసి షాక్ అవుతుంది.
తరువాత ష్.. అని డోర్ తీస్తుంది. ఇద్దరు లోపలికి వస్తారు. ఆ బాత్రుం నుంచి సౌండ్ వస్తుంది. అది చూసి బాయ్ ఫ్రెండ్ సుత్తితో అతని దగ్గరకు వెళ్తుంటాడు. బాత్రుం వరకు వెళ్లి.. నేను ఇక్కడ ఉన్నట్లు ఎందుకు చెప్పావు అని స్వప్నవైపు కోపంగా చూస్తాడు. దాంతో స్వప్న భయపడుతుంది. అతని చేతులో ఒక లేడీ ఉంటుంది. స్వప్న భయపడుతూ వెనక్కు అడుగులు వేస్తుంది. తన రూమ్ లోని గోడలు అన్ని రక్తం లైన్స్ వస్తుంటాయి. వెనకనుంచి ఎవరో చేయి వేస్తారు. తన బాయ్ ఫ్రెండ్ కళ్లు మొత్తం వైట్ గా ఉంటాయి. భయంతో స్వప్న గట్టిగా అరుస్తుంది. చంటిపాపను ఎత్తుకున్న జీసస్ బొమ్మ ఉంటుంది. తరువాత రోజు పోలీసులు వచ్చి చూసేసరికి స్వప్న శవం బాత్ టబ్ లో ఉందని, ఇదే విషయాన్ని స్వప్న తల్లి కూడా పోలీసులతో చెప్పింది అని వాచ్ మెన్ అమృతతో చెప్తాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొడుకును, భార్యను చంపిన రోజే స్వప్న బాయ్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్తాడు. అతనే దెయ్యంగా మారి తనను చంపాడు.. ఈ ఒక్క సమాధానంతో కథ ముగిసిపోయింది అని చెప్తాడు. దీనిపై అమృత తన అభిప్రాయం చెప్తుంది. తాను చనిపోవడానికి కారణం తాను తీసుకున్న పిల్స్ అని, తన ప్రాణం తానే తీసుకుందని చెప్తుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.
స్వప్న ఇంట్లోకి వస్తుంది. లేడి నర్స్ పడుకొని ఉంటుంది. తల్లికి గ్లూకోజ్ ఎక్కుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి అన్నం పెట్టుకొని ఆలోచిస్తుంది. చిన్నప్పుడు తన అమ్మానాన్నలతో అన్నం తినే సీన్ గుర్తు చేసుకుంటుంది. ఏడుస్తుంది. డిన్నర్ చేయకుండానే లేచి వెళ్లిపోతుంది.
తరువాత మాన్షన్ కు వెళ్తుంది. వాచ్ మెన్ వంట చేసుకుంటూ తనతో మాట్లాడుతాడు. రూమ్ నెంబర్ 605 గురించి చెప్తాడు.
మాన్షన్ కు ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీతో రాధా భర్త ట్యాక్సీ నుంచి దిగుతాడు. వాళ్లు రూమ్ లోకి వెళ్తారు. ట్యాక్సీ డ్రైవర్ డబ్బులు తీసుకొని ప్లాట్ 613 కి మాత్రం వెళ్లకండి అని చెప్తాడు. అతను ఏదో చెప్తుంటే డోర్ వేస్తాడు రాధా భర్త. అతను అలానే చెప్తుంటాడు.. మళ్లీ డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. విసుక్కొని డోర్ తీస్తే బయట బైరాగి ఉంటాడు. అతను మీకు మరణం తథ్యం అని చెప్తాడు. దాంతో రాజీవ్ కనకాల ఆలోచిస్తాడు. తరువాత వాళ్లనాన్న లైట్ వేసి దేవుడమ్మ తన భార్య ఫోటో వైపు చూస్తాడు. అక్కడ బల్బు వెలగదు. తరువాత రాజీవ్ కనాకాల కూతురు కథ చెప్పమని అడుగుతుంది. నైట్ చెప్తా అంటాడు. నైట్ అందరూ పడుకుంటారు. కథ చెప్పమని అడుగుతుంది. వాళ్ల ఊర్లో జరిగే కథ గురించి చెప్తాడు. వాళ్ల ఊర్లో ఓ పండుగకు ప్రతి ఇంటి నుంచి మొదటి భోజనం తీసుకొస్తారు అని అదంతా మెతకు మిగల్చకుండా వాళ్ల అమ్మ దేవుడమ్మ తింటుంది.
తరువాత ఊర్లో ఒకరికి దెయ్య పడితే తాను పాచికలు వేసి దెయ్యాన్ని పోగొడుతుంది. అలా ఒక సమయంలో దేవుడమ్మ మరణిస్తుంది. మరణించే అప్పుడు నేనూ నీతోనే కలిసి ఉంటాను అని చెప్తుంది. అప్పటి నుంచి వాళ్ల అమ్మ కోసం ఎదురుచూస్తుంటాడు.
ఆ కథ విన్నా తన కూతురు.. నాన్నమ్మ ఆత్మలతో మాట్లాడినట్లు నువ్వు కూడా నానమ్మతో మాట్లాడొచ్చుగా అంటుంది. అతను అలా ప్రయత్నించాను అని.. పాచికలు వేసి.. గజ్జలు సప్పుడు చేస్తూ.. మాట్లాడడానికి ప్రయత్నించినట్లు చెప్తాడు. అంతలో తన భార్యకు మెలుకువ వచ్చి రాత్రిపూట పిల్లలతో చెప్పే కథలు ఇవేనా పడుకోండి అని చెప్తుంది. దేవుడమ్మ ఫోటో దగ్గర లైట్ వెలుగుతుంది. దేవుడమ్మ పెట్టెలోంచి పాచికలు, గజ్జెలు తీసి తన తండ్రి ఇస్తాడు.
తరువాత సీన్లో ఇంట్లో పిల్లలు టిఫిన్ చేస్తుంటారు. భార్త దేవుడమ్మ ఫోటో దగ్గర మొక్కుతుండగా రాధా ఆఫీస్ కు వెళ్తున్నట్లు చెప్తుంది. రాధా స్వప్న కొలిగ్.. తనకు ఫోన్ వస్తుంది. డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని ఒకడు బెదిరిస్తుంటాడు. రెండు నెలల్లో ఇస్తా అని చెప్తుంది. అక్కడికి స్వప్న వస్తుంది. రాధా బాధగా ఉంటే ఏమైంది అని స్వప్న అడుగుతుంది. తన భర్త బిజినెస్ దెబ్బతినడంతో డిస్టర్బ్ అయ్యాడు అని, దానికి తోడు చనిపోయిన తన తల్లి బతికొస్తుందని రోజంతా తన ఫోటో దగ్గరే ఉంటాడు అని, అప్పులొల్లు రోజు ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నట్లు చెప్పి బాధ పడుతుంది.
నెక్ట్స్ సీన్లో తన పిల్లలతో సహా రాజీవ్ రూమ్ నెంబర్ 613 ముందు నిలబడి ఉంటారు. గజ్జెల ఊపుతూ ఆ కుటుంబం ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఆ విషయం బైరాగికి తెలుస్తుంది. ఇంట్లో పసుపుతో ఒక పటం వేసి గవ్వలు వేసి గజ్జెలు ఊపుతూ… తల్లిని పిలుస్తాడు. గవ్వలు పైకి లేస్తాయి. అందరూ ఆశ్యర్యంగా చూస్తాడు. తల్లి ప్రత్యక్షం అవుతుంది. తనను ఆవహిస్తుంది. కట్ చేస్తే ఇంటికి రాధ వస్తుంది. కరెంట్ వేయబోతే షాట్ సర్క్యూట్ అవుతుంది. ఇంట్లో ఎవరు ఉండరు. అమ్ము అను కుంటూ వెతుకుతుంది. అంతలో తన భర్త తలను బీరువకు కొట్టుకుంటు ఉంటాడు. అగ్గిపుల్ల ఆరిపోతుంది. మళ్లీ వెలిగిస్తే తన తల్లి ఫోటో పట్టుకొని కనిపిస్తాడు. అమ్మ కనిపించింది అని చెప్తాడు. అమ్ము ఎక్కడా అని రాధ అడుగుతుంది. తనను తీసుకొని 613 ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ దేవుడమ్మ తింటుంది. రాధ అక్కడికి వస్తుంది. చూసి షాక్ అవుతుంది. అమ్ము దేవుడమ్మలా మారుతుంది. వారితో అమ్ము మాట్లాడుతుంది. రాధ చూసి షాక్ అవుతుంది. ఈ కుటుంబాన్ని ఒక్కదానివే ఎన్ని రోజులు నడుపుతావు అని, నువ్వు కూడా మాతో రా.. ఏ కష్టం లేకుండా బతుకుదాం అని చెప్తుంది. దాంతో రాధా కూడా వారిదగ్గరకు వెళ్తుంది. డోర్లు మూసుకుంటాయి. బైరాగి గాల్లో చూస్తూ తన చేతిలోని తాడును తెచ్చుతాడు. ఆ కుటుంబానికి ఏం జరిగిందని అమృత అడుగుతుంది. తరువాతి రోజు ఇంట్లో పనిమనిషి వచ్చి వారికోసం చూస్తుంది. పక్కనే ఉన్న డోర్లు ఓపెన్ అవుతాయి కుటుంబం అంతా ఊరిపోసుకొని చనిపోతారు. పని మనిషి ఒక్కసారిగా ఏడుస్తుంది.
మెంటల్ డిస్టర్బ్ అయిన రాధా భర్త కారణంగానే వారి కుటుంబం చనిపోయింది అని అమృత చెబుతుంది. వాచ్ మెన్ కంటికి దెబ్బ తగలడంతో అతనికి ఒక అయిట్మెంట్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇంట్లో తులసి కోట చుట్టు అమృత ప్రదక్షణాలు చేసి తల్లికి, నర్సుకు బొట్టుపెడుతుంది. మెడిసిన్ బాక్స్ కోసం నర్సు వెతుకుతుంది. ఆ బాక్స్ పెట్టిన దగ్గర లేకుండా వేరే చోట ఉంటుంది. అది కదులుతూ ఉంటుంది. దానికోసం వెళ్లీ తీసుకుంటుండగా అక్కడ గజ్జె కట్టిన కాలు ఒకటి కనిపిస్తుంది. నర్సు భయపడుతుంది. అక్కడికి అమృత వస్తుంది. ఆమెను చూసి కూడా నర్సు భయపడుతుంది. నువ్వు మాన్షన్ కు వెళ్లడం వలనే ఇలా జరుగుతుందని అంటుంది నర్సు.. దాన్ని కొట్టి పరేస్తుంది అమృత..
కట్ చేస్తే వాచ్ మెన్ స్టోరీ చెప్పడం ప్రారంభం ఇస్తాడు.. ఈ సారి రూమ్ నెంబర్ 409 గురించి చెప్తాడు. గదిలో రాధిక పూజ చేసుకొని కాళ్లకు గజ్జెలు కట్టుకొని క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. అలా చేస్తూ ఉంటే దీపం ఆరిపోతుంది. ఏం జరిగిందని చూసి వెళ్లి దీపం ముట్టిస్తుంది. ఏదో ఫ్లాష్ లైట్ వెలిగినట్లు అనిపిస్తుంది. తరువాత అద్దం మీదున్న లైట్ మిలుకుమిలుకు మంటూ వెలుగుతూ ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలుగుతుంది. తరువాత అద్దంలో తన ప్రతిబింభం కదలదు. తాను చేసినట్లు డ్యాన్స్ చేయదు. ప్రతిబింభం వింతగా బిహేవ్ చేస్తుంది. తనను కింద పడేస్తుంది. తన మెడలు విరిచినట్లు చేస్తుంది. దాంతో భయపడి ఒక్కసారిగా బెడ్ నుంచి లేస్తుంది రాధిక. తన కల కంది. చెమటలు తూడుచుకుంటుంది. అంతలో తనకు తన భర్త నుంచి ఫోన్ వస్తుంది. తనకు అదే కల మళ్లీ వచ్చినట్లు వీడియో కాల్లో చెప్తుంది రాధిక. తనకు అన్ని వింతవింతగా జరుగుతున్నట్లు చెప్తుంది. అదే కల కదా దానిలో ఏముంది భయపడడానికి, గతం గురించి మర్చిపో అని తనకు ఏదో పార్సల్ పంపించినట్లు చెప్తాడు. అంతలో మళ్లీ ఫ్లాష్ లైట్ వెలుగుతుంది. కాలింగ్ బెల్ మోగిందని బయటకు వెళ్లి చూస్తే అక్కడ ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. దాన్ని తీసుకొని ఇంట్లోకి వచ్చి చూస్తుంది. అందులో ఒక బేబీ డాల్ ఉంటుంది. దాన్ని తీసుకొని అలాంటి బొమ్మలు ఉన్నదగ్గర పెడుతుంది. తాను వెళ్లిన తరువాత ఆ బొమ్మ కదులుతుంది.
నెక్ట్స్ సీన్లో రాధిక ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకుంటుంది. బేబీ ఆరోగ్యంగా ఉందని చెప్తుంది డాక్టర్. అదే సమయంలో అక్కడ కూడా తనకు ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. తన మైండ్ కొంచెం డిస్టార్బ్ గా ఉందని, ఆ ప్రెషర్ బేబీపైన పడుతుందని, ఒక హిప్నటిస్ట్ ను కలువమని సలహా ఇస్తుంది. అంతలో మళ్లీ ఫ్లాష్ లైట్ వెలుగుతుంది. తాను అలానే చూస్తూ ఉంటుంది. తరువాత సీనల్లో రాధిక మాన్షెన్ లోని తన రూమ్ కు వెళ్తుంది. ఫోన్ కు వాట్సప్ మెసేజ్ లు వస్తాయి. తనను ఫోటోలే తనకు పంపిస్తారు. ఆ నెంబర్ కు ఫోన్ ట్రై చేస్తే కలువదు. అంతలో చిన్న పిల్ల ఏడ్చిన సౌండ్ వినిపిస్తుంది. ఇల్లంత తిరగి చూస్తోంది. అయినా ఆ సౌండే వినిపిస్తుంది. మంచం కింద చూస్తే ఒక డాల్ ఉంటుంది. దాన్ని పట్టుకుందామని చేయిపెడితే అక్కడ ఒక వింత చేయి వచ్చి డాల్‌ను లాక్కెళ్లుతుంది. అది చూసి రాధిక భయంతో పానిక్ అయిపోతుంది.
కట్ చేస్తే రాధిక హిప్నటిస్ట్ దగ్గరకు వెళ్తుంది. తన ప్రాబ్లమ్ గురించి చెప్తుంది. ఇంట్లో ఎవరు లేకపోయినా, ఎవరో తనను గమనిస్తున్నట్లు, చిన్న పిల్లల ఏడుపు వినిపిస్తున్నట్లు చెప్తుంది. థెరఫీ స్టార్ట్ చేద్దామని తనను రిలాక్స్ అవమని చెప్తాడు. తాను సోఫాలో పడుకొని క్లాక్ ను చూస్తూ పడుకుంటుంది. తన గతం గురించి అడుగుతాడు.. రాధిక డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. అక్కడ ఎవరో తనను ఫోటోలు తీస్తున్నట్లు ఫ్లాఫ్ లైట్ కనిపిస్తుంది. దాన్ని వెతుకుతూ వెళ్తుంది. అక్కడ ఒక అతను కెమెరా పట్టుకొని ఆ ఫోటోలను చూస్తూ ఉంటాడు. అవి చూసి నవ్వుతుంది. అలా రాజుతో స్నేహం మొదలు అయింది అని చెప్తుంది. ఒక కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తుంది. అక్కడ కూడా రాజు ఫోటోలు తీస్తుంటాడు. వారి స్నేహం ప్రేమగా మారుతుంది. తన కళ్లు మూసుకొమ్మని తనకు పట్టీలు బహుమతిగా ఇచ్చి తన పాదాలకు కడుతాడు. తరువాత వాటిని ముద్దాడుతాడు. వారు అలా మూవ్ ఆన్ అవుతారు. ఒక రోజు తాను అబర్షన్ పిల్స్ వేసుకుందని, తనకు బేబీకన్నా డ్యాన్స్ ముఖ్యమని చెప్తుంది రాధిక. దాంతో రాజు రాధికకు ఆసహించుకొని వెళ్లిపోతాడు. రాధకు మెలుకువ వస్తుంది. రాజును మళ్లీ ఎప్పుడైనా కలిశారా అంటే లేదు అని చెప్తుంది. నెక్ట్ 2, 3 సెషన్స్ లో మీ భయం పూర్తిగా నయం అవుతుందిన చెప్తాడు. మళ్లీ అక్కడ ఫ్లాష్ కనిపిస్తుంది.
తరువాత సీన్లో తాను రూమ్ కు వెళ్లి లైట్స్ వేస్తుంది. అవి వెలగవు, ఊయల దానింతట అదే ఊగుతుంది. వీణ వైర్లు తెగుతాయి. గజ్జెలు మోగుతాయి.. అంతలో తన మొబైల్ రాజు చనిపోయినట్లు ఉన్న ఒక పిక్ మెసేజ్ వస్తుంది. అది చూసి భయపడుతుంది. తరువాత బేబీ ఏడుపు వినిపిస్తుంది. దాన్ని వెతుక్కుంటూ బయటకు వస్తుంది. బయట ఒక బేబీ కనిపిస్తుంది. తీసుకుందామని కిందికి కూర్చోగానే వెనుకాల్ ఒక దెయ్యం పిల్ల కనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు.. ముందు బేబి కూడా ఉండదు. అమ్మా అనే సౌండ్ వినిపిస్తుంది. ఇంట్లోకి వెళ్తుంది. అద్దంలో తన రూపం కనిపించదు.. ఒక పిండం కనిపిస్తుంది. అది పాపాలా మారి తనతో మాట్లాడుతుంది. అదే సమయంలో రాజు దెయ్యంలా మారి అక్కడికి వచ్చి ఎందుకు చంపేశావు అంటాడు. తరువాత రాధిక పైకి లేస్తుంది. తన ఫోటో కాలిపోతుంది. ఇదే విషయాన్ని వాచ్ మెన్ చెప్తాడు.
తాను మెంటల్ గా వీక్ అయింది అని, రాజు చనిపోయిన విషయం హిప్నటిస్ట్ తో చెప్పకుండా దాచిందని, తాను పెళ్లి తరువాత కన్సీవ్ అయింది. అప్పటి నుంచే తన జ్ఙాపకాలు తనను వెంటాడాయని, తన భ్రమకు భయం తోడు అయింది. దాంతో మాన్షెన్ పై నుంచి దూకి చనిపోయింది అని చెప్తుంది అమృత. అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. ఇంటిదగ్గర వాచ్ మెన్ వచ్చి అమృతతో సీసీ కెమెరాను చూపించి ఏదో చెప్తాడు. దాన్ని చూసి అమృత ఆలోచిస్తుంది.. ఎపిసోడ్ అయిపోతుంది.
డోర్ ఓపెన్ చేస్తుంది అమృత. ఇల్లు అంతా చిందరవందరగా ఉంటుంది. అక్కడ ఒక డైరీని తీసుకొని తన గతాన్ని తలుచుకుంటుంది. తన ఫాదర్ తనను ఎంత ముద్దుగా చూసుకునేది గుర్తొచ్చి బాధ పడుతుంది. మరో డైరీని తీసుకొని చూస్తుంది.
ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఆర్కియాలజిస్ట్ లు ఒక చోట తవ్వుతుంటారు. అక్కడ వారికి ఒక బాక్స్ కనిపిస్తుంది. దాంట్లో ఏదో ఉందని వారు భావిస్తారు. తరువాత కాళిదాసు ఇంటికి వచ్చి దాన్ని ఓపెన్ చేసి అందులోని అక్షరాలను నోట్ చేసుకుంటాడు. తరువాత మాన్షెన్ దగ్గరకు వెళ్తాడు. అలా వెతుక్కుంటూ మాన్షన్ 24 దగ్గరకు వెళ్తాడు. అది బుక్ లో రాసి ఉంటుంది.
కట్ చేస్తే అమృత మాన్షెన్ దగ్గర దిగితుంది. తాను లోపటికి వెళ్తుంటే జాగ్రత్తా అని మాన్షెన్ ముందు ఉన్న వ్యక్తి హెచ్చరిస్తాడు. అమృత లోపలికి వెళ్తుంది. అక్కడ 24 నెంబర్ డోర్ దగ్గరకు వెళ్లి తాళం కోసం అటుఇటు చూస్తుంది. ఒక రాయి తీసుకొని పగల గొట్డడానికి ట్రై చేస్తుంది. ఏవో గజ్జల సౌండ్స్ వినిపించి ఆగిపోతుంది.
తరువాత సీన్లో వాచ్ మెన్ చేపలను కోస్తూ ఉంటాడు. తాను రికార్డింగ్ స్టార్ట్ చేస్తుంది. రూమ్ నెంబర్ 307 లిల్లీ కథను స్టార్ట్ చేస్తాడు. లిల్లీ ఒక శవపేటికలో పడుకొని ఉంటాడు. అక్కడ నుంచి లేచి సిగర్ అంటించుకొని ఒక బొమ్మను చేస్తుంటాడు. ఆ బొమ్మకు లిప్‌స్టిక్ పెడుతాడు అదే చేతితో తాను పెట్టుకుంటాడు. ఆ బొమ్మను ఒక గోడకు పట్టి బయటకు వెళ్తాడు. ఒక ఫ్రీజర్ రూమ్ కు వెళ్తాడు. అక్కడ డెడ్ బాడీ పార్ట్స్ ఉంటాయి. అందులోంచి జెస్సీ లెగ్ ను తీసుకొని దాన్ని కోస్తాడు. అలా ఆ మీట్ ను కైమా కొట్టి టేస్ట్ చూస్తాడు. దాన్ని ఒక బాక్స్ లో పెడుతాడు. అంతలో బెల్ మోగుతుంది. బయటకు వచ్చి దాన్ని ఒక అతనికి ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. ఇంట్లోకి వచ్చి కుకింగ్ చేసుకుంటాడు.
కారు తీసుకొని బయటకు వెళతాడు. అక్కడ అంతా ప్రాస్టీట్యూషన్స్ ఉంటారు. అందరిని చూసుకుంటూ సుల్తానా దగ్గర ఆగి విజిల్ వేసి తన కార్లో ఎక్కించుకొని వెళ్లిపోతాడు. తన ఫ్లాట్ ను చూసి సుల్తానా సంతోష పడుతుంది. తరువాత ఆ మాస్క్ లను చూసి చాలా బాగున్నాయి అంటుంది. తరువాత వాటి గురించి మాట్లాడుతుంది. ఆకలిగా ఉందని ఏదైన తిందామా అని అంటుంది. తాను ప్రిపేర్ చేసిన డిష్ ను తినమని ఇస్తాడు. అది తినుకుంటూ చాలా బాగుంటుందని అంటుంది. తరువాత తనకు డ్రింక్ లో ఏదో కలిపి తాగించడానికి ట్రై చేస్తాడు. తానకు అలవాటు లేదని తాగదు. వైన్ మీద పడుతుంది. క్లీన్ చేసుకోవడానికి వాష్ రూమ్ కు వెళ్తుంది. తరువాత డ్రెస్ ఛేంజ్ చేసుకొని వస్తుంది. లిల్లి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటే తనకు ఒక లేడీ ఫేస్ కనిపిస్తుంది. సుల్తానా భయపడుతుంది. తరువాత అలాంటిది ఏం లేదని తనతో రోమాన్స్ చేస్తుంటాడు లిల్లీ.. అంతలో సుల్తానా కళ్లు తెరవగానే తనకు జెస్సీ కనిపిస్తుంది. సుల్తానా భయపడి జెస్సీ, జెస్సీ అని అరుస్తంది. లిల్లీకి ఏం అర్థం కాదు.. బెడ్ పై నుంచి లేచి తన మాస్క్ లను చూస్తే అక్కడ జెస్సీ మాస్క్ కనిపించదు. అదే సమయంలో సుల్తానా మీద జెస్సీ పడుతుంది. దాంతో సుల్తానా భయపడి వెళ్లిపోతా అంటుంది. తరువాత జెస్సీని వెతుకుతాడు లిల్లీ. జెస్సీ ఇంట్లో తిరుగుతూ కనిపిస్తుంది. క్యాండిల్ పట్టుకొని లిల్లి వెతుకుతుంటాడు. లిల్లీని భయపట్టిస్తుంది. తరువాత క్యాండిల్ ఆరిపోతుంది. జెస్సీని ఒక్క సారిగా భయపెట్టి మీదకు దూకుతుంది జెస్సీ.. సుల్తానాను చూస్తుంది. సుల్తానా తల గొడకు తాకుతుంది. లిల్లీ మరణిస్తాడు. ఈ ఘటనలో సుల్తానా పిచ్చిది అయినట్లు వాచ్ మెన్ చెప్తాడు. దానికి సంబంధించిన పేపర్ ఆర్టికల్ కూడా చూపిస్తాడు. అమృత మౌనంగా అక్కడి నుంచి సమాధానంతో తిరిగి వస్తా అని వెళ్లిపోతుంది. ఎపిసోడ్ అయిపోతుంది.
సుల్తానాను వెతుక్కుంటూ అమృత ఆసుపత్రికి వెళ్తుంది. అక్కడ సుల్తానా గురించి డాక్టర్లు కొన్ని విషయాలను చెప్తారు. తరువాత తాను ఒక గ్రంథలయంలోకి వెల్లి రెండు పేపర్లను తీసుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్తుంది. అక్కడ కొన్ని నిజాలు తెలుసుకుంటుంది. తరువాత వాచ్ మెన్ దగ్గరకు వెళ్లి రజియా కథను చెప్తుంది. లిల్లి తన బిజినెస్ కు కావాల్సిన అమ్మాలను రోడ్ల మీద ఉండే వాళ్లు, ప్రాస్టిట్యూషన్లను ఎన్నుకుంటాడు. అలా రజీయా కూడా లిల్లి చూపులకు బలి అయింది అంటూ రజియా కథ చెప్తుంది. అలా ఒక రోజు రజియాను తీసుకొని తన ఫ్లాట్ కు తీసుకెళ్తాడు. తన నోట్లో డబ్బు కట్టపెట్టి కాళ్లు చేతులు కట్టేస్తాడు. తనను రంపంతో కోస్తాడు. రజియాను చంపెస్తాడు. రజియాను వెతుకుతూ సుల్తానా లిల్లీ ఇంటికి వచ్చింది. అక్కడ రజియా మాస్క్ ను చూసి బాధపడింది. తరువాత ఫ్రీజర్ రూమ్ ను షాక్ అవుతుంది. తన పేరు పచ్చ వేసుకున్న రజియా చేతిని చూస్తుంది. తన బర్త్ డేకు గిఫ్ట్ గా తన చెల్లీ అలా చేస్తుంది. అలా లిల్లీ రూమ్ లోకి ఎంటర్ అయినా సుల్తానా మనిషిగా వాడిని ఏం చేయలేమని దెయ్యంగా నటించి లిల్లీని చంపేసింది అని అమృత చెప్తుంది. ఇక సుల్తానా తాను కలిసినట్లు కూడా చెప్తుంది.
దాంతో వాచ్ మెన్ అమృతను పొగుడుతాడు. సమస్యను చూసి పారిపోతావు అనుకున్నా కాని నువ్వు సాధించావు అని చెప్తాడు. ఇక తనకు రూమ్ నెంబర్ 24 గురించి చెప్పమని కోరుతుంది. దాంతో హడలి పోయిన వాచ్ మెన్ తనకే కీస్ ఇచ్చి జాగ్రత్త అని చెప్తాడు. కీస్ తీసుకొని అమృత బయలుదేరుతుంది. రూమ్ నెంబర్ 24 కీస్ చూస్తూ.. లాక ఓపెన్ చేస్తుంది. మెళ్లిగా లోపలికి నడుచుకుంటూ వెళ్తుంది. భయంకరమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్, గజ్జెలు కట్టుకున్న అమ్మాయి వెనకనుంచి నడుచుకుంటు వెళ్తుంది. అంతలో ఒక శవపేటిక నుంచి ఒక చేయి బయటకు వస్తుంది. తరువాత తేరుకున్న అమృత ఆ శవపేటికను పక్కకు జరుపుతుంది. దాని కింద ఒక అండర్ గ్రౌండ్ ఉంటుంది. దానిలోకి వెళ్తుంది. అక్కడ ఒక గోడకు ఒరిగి ఆలోచిస్తుంది. అంతలో తన తండ్రికి కట్టిన తాడు తన చేతికి తడుతుంది. దాన్ని చూస్తు గతాన్ని ఆలోచిస్తుంది. ఒక సారి తన టండ్రికి రక్షగా ఒక తాడును కడుతుంది. అది గుర్తుకు వచ్చి బాధపడుతుంది. వెంటనే ఆ గోడవైపు చూస్తుంది. పక్కానే ఉన్న సుత్తెతో గోడను బద్దలు కొడుతుంది. ఒక రాయి కింద పడుతుంది అలా చూస్తూ ఉండిపోతుంది. ఏడుస్తుంది. అంతలో అక్కడికి అమృత అంటూ.. వెనుకాలనుంచి చప్పట్లు కొడుతూ వాచ్ మెన్ వస్తాడు.
అమృత ఈ మాన్షన్ కు రావడానికి ముందే ఎస్ ఐ భైరవ, డైరెక్టర్ జయప్రకాశ్ ఇద్దరు తనకు చెప్పినట్లు చెప్తాడు. అంతా విన్న అమృ అయిపోయిందా సీతారామ్ అని అతనికి షాక్ ఇస్తుంది. ఈ మాన్షెన్ లో అల్లిన కథలు అన్ని నువ్వు నన్ను భయపెట్టడానికే అని తెలుసు అని, అతన్నే ఫాలో అయిన వివరాలు చెప్తుంది అమృత. ఇక వాళ్ల నాన్న కాళిదాసును చంపినందుకు నీకు శిక్షపడాలి అని చెప్తుంది. దానికి నవ్వుతూ సీతారామ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు.
అలంఘీర్ నిర్మించిన ఈ సమాధిలో సుమారు వందడుగుల లోపల నిధి ఉందని, అది పద్మనాభస్వామి అలయ సంపద కన్నా పది రెట్లు ఉంటుందని చెప్తాడు కాళిదాసు చెప్తాడు. దాంతో సీతారామ్ నిధిని మనం తీసుకుందామని వాధిస్తాడు. దానికి కాళిదాసు ఒప్పుకోడు. దాంతో అతన్ని గొడుకుతో పొడిచి చంపేస్తాడు. వీళ్లతో చేతులు కలిపిన జయప్రకాశ్ కూడా కాళిదాసుకు హెల్ప్ చేయడు. అలా కాళిదాసును చంపి అక్కడే పూడ్చి పెడుతారు. అలా చేసినందుకు నీకు మరణశిక్షపడుతుంది అని అమృత అంటుంది. ఇక గజ్జలు కట్టుకున్న తన మనుషులను పిలుచి, అమృతను చంపేయమట్టాడు. అమృతను కొడుతారు. అక్కడ భైరవ, జయప్రకాశ్ చూస్తారు. అక్కడికి ఒక కాకి వస్తుంది. అది అరుస్తుంది. దాన్ని చూసి ఆగతారు. జయప్రకాశ్ దాన్ని వెల్లగొడుతాడు. అంతలో కాళిదాసు సమాది బద్దలు అయి.. కాళిదాసు నడుచుకుంటూ వస్తాడు. అమృతను ప్రేమగా తల నిమురుతాడు. గట్టిగా అరుస్తాడు. అమృత శరీరంలో సీతారామ్ కు కాళిదాసు కనిపిస్తాడు. దాంతో సీతారామ్ భయపడిపోతాడు. నీకు శిక్షపడాలి అని సీతారామ్ ను బయటకు నెట్టేస్తాడు.
తరువాత సీన్లో సావిత్రి బెడ్ పైన పడుకుని ఉండగా.. సావిత్రి అని కాళిదాసు పిలుపుతో వినిపించి, లేచి నడుచుకుంటు వస్తుంది. అమృత, నర్సు ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. సావిత్రి నడుచుకుంటూ వచ్చి కాళిదాసును దగ్గర నిలబడుతుంది. అతను అవిరి అయిపోతాడు. తరువాత అమృతను హగ్ చేసుకుంటుంది. కాళిదాసు నేరస్తుడు కాదు ఆయన గొప్ప వ్యక్తి విధినిర్వహాణలో ప్రాణాలు కోల్పోయాడు అని న్యూస్ ఛానెళ్స్ చెబుతుంటాయి. ఆయన స్థానంలో అమృత జాబ్ లో జాయిన్ అవుతుంది. మాన్షెన్ లో ఉన్న నిధిని తవ్వడానికి అక్కడికి వెళ్తుంది. మళ్లీ అక్కడికి బైరాగి వచ్చి తనతో మాట్లాడి పిచ్చిగా చప్పట్లు కొట్టి నవ్వుతాడు. తరువాత పనులు మొదలు అవుతాయి.. అక్కడ అమృతకు ఒక నాగబంధంతో ఉన్న బిల్ల దొరుకుటుంది. సర్ అంటూ దాన్ని చూపిస్తుంది. అది వెంటనే పడేయ్ అని వారు చెప్తుండగానే.. అమృత ఒక సొరంగలోకి వెళ్తుంది. సిరీస్ సీజన్ 1 అయిపోతుంది.