Geetha క్యాసినో ఆడేది.. డబ్బు పోయింది, ఎక్కువేం కాదు: భర్త నందు
గీతామాధురి క్యాసినో ఆడేదని.. దీంతో డబ్బు పోగొట్టుకున్నానని భర్త నందు తెలిపారు. డబ్బు పోయిన తర్వాత క్యాసినో ఆడొద్దని గీతకు చెప్పానని అంటున్నారు. దర్శకులతో సోషల్ మీడియాలో కాంటాక్ట్ కాలేదని.. అందుకే తనకు తగిన అవకాశాలు రాలేదని చెబుతున్నారు నందు.
Actor Nandu: ప్లే బ్లాక్ సింగర్ గీతా మాధురి, నటుడు నందు (Actor Nandu) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ పాప కూడా ఉంది. పెళ్లి తర్వాత గొడవలు కామనే.. కానీ వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అందుకు గల కారణం.. గీతా మాధురి ఖర్చులు.. క్యాసినో ఆడటం అని తెలిసింది. దీనికి సంబంధించి ఆమె భర్త నందు క్లారిటీ ఇచ్చారు.
గీత తెలివైనదే.. కానీ కొన్ని అలవాట్ల వల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెబుతున్నారు నందు (Nandu). క్యాసినో ఆడటం అలవాటు.. అలా డబ్బులు పోయాయి.. వచ్చాయి.. ఓ సారి డబ్బులు బాగానే పోయాయి. అది చిన్న అమౌంట్ కాదన్నారు. అలాగని తమ జీవితాన్ని ప్రభావితం చేసే మొత్తం కాదని చెప్పారు. తర్వాత క్యాసినో ఆడొద్దని చెప్పానని స్పష్టంచేశారు. మాములు గొడవలే తమ మధ్య ఉన్నాయని.. విడిపోవడం లేదని స్పష్టంచేశారు.
దర్శకులు సుకుమార్ (sukumar), బోయపాటి శ్రీను (srinu) తనకు బాగా తెలుసు అని నందు తెలిపారు. వారితో సినిమా చేయడం వల్ల పరిచయం ఏర్పడిందన్నారు. వారితో సోషల్ మీడియాలో టచ్‌లో లేనని వివరించారు. అది మైనస్ అయ్యిందని గుర్తుచేశారు. టచ్‌లో లేకుంటే.. తమకు ఎలా ఆలోచన వస్తోందని ఓ సారి సుకుమార్ అన్నారని గుర్తుచేశారు. కెరీర్‌పై దృష్టిసారించానని తెలిపారు. సింగర్‌గా గీతా మాధురి తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడిగా నందు ఆశించిన స్థాయిలో పేరు తెచ్చుకోలేదు.