కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. తెలుగు చలనచిత్ర నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వబోతున్నట్లు సమాచారం.
Bharatharatna: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. తెలుగు చలనచిత్ర నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వబోతున్నట్లు సమాచారం. కేంద్ర కేబినేట్ సమావేశంలో ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చాలామంది వాళ్ల ప్రతిపాదనలు, వినతులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. దివంగత సీఎం నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ ఖ్యాతి ఇనుమడింపజేసేలా, కేంద్ర పెద్దలకు తెలిసేలా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అంటే చరిత్ర అని, సినిమా అయినా రాజకీయాలు అయిన అతను తిరుగులేని వ్యక్తిని తెలిపారు. ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని చంద్రబాబు తెలిపారు. సినిమాల్లో ఎన్టీఆర్ చేసిన పాత్రలు ఎవరూ చేయలేదని, అవి ఎవరికీ సాధ్యం కాదని ఆయనే మళ్లీ జన్మించాలని తెలిపారు. ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని, తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు.