»Rameswaram Cafe Main Accused Arrested In Blast Case
Rameswaram Cafe: పేలుడు కేసులో అదుపులోకి ప్రధాన నిందితుడు
కర్ణాటక రాజధాని బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా అరెస్ట్ చేసింది.
Rameswaram Cafe: కర్ణాటక రాజధాని బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా అరెస్ట్ చేసింది. నిందితుడు బళ్లారికి చెందిన షబ్బీర్‌గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నాడు. ఇంకా నిందితుడిని విచారించనున్నారు. బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1 శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు.
కేఫ్‌లో పేలుడు జరిగిన గంట తర్వాత అనుమానితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. వీడియోలోని టైమ్‌స్టాంప్ మార్చి 1న మధ్యాహ్నం 2:03 గంటలకు ఉంది. పేలుడు మధ్యాహ్నం 12:56 గంటలకు జరిగింది. అదే రోజు రాత్రి 9 గంటలకు మరో ఫుటేజీలో అనుమానితుడు బస్ స్టేషన్లో తిరుగుతున్నట్లు గమనించారు. దీంతో ఈ పేలుడు ఘటనలో అతడే ప్రధాన నిందితుడిగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు కూడా ఇస్తామని ఎన్ఐఏ ఇప్పటికే ప్రకటించింది. దాదాపు ఘటన జరిగిన 13 రోజులకు ప్రధాన నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.