»Unexpected Guest Superstar For Bigg Boss 7 Finale
Finale ఊహించని గెస్ట్.. బిగ్ బాస్ 7 ఫినాలేకి సూపర్ స్టార్?
బుల్లితెర రియాల్టీ షోల్లో బిగ్ బాస్ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో బిగ్ బాస్ షో పాపులర్ అయింది. తెలుగులో ఇప్పటి వరకు ఆరు సీజన్లు జరిగాయి. ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది. తాజాగా ఈ సీజన్ ఫినాలేకి సూపర్ స్టార్ గెస్ట్‌గా రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
Unexpected guest.. Superstar for Bigg Boss 7 finale?
Bigg Boss 7 finale: బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 6 చప్పగా సాగిన సంగతి తెలిసిందే. ఏదో షో ఉందంటే ఉంది అనేలా.. అసలు కంటెస్టెంట్స్ ఎవరనేది కూడా తెలియకుండా సాగిపోయింది. 6 సీజన్లో రేవంత్ విజేతగా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ 7 సీజన్ (Bigg Boss 7 finale) మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి. ఉల్టా పుల్టా గేమ్ షోలతో ఆడియెన్స్‌కు భలే కిక్ ఇస్తున్నాడు కింగ్ నాగార్జున. త్వరలో బిగ్ బాస్ 7 సీజన్ షో ముగియనుంది. ఫినాలే కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 7వ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ని డిసెంబర్ 17న నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో.. గ్రాండ్ ఫినాలేలో పలువురు సెలబ్రిటీలు సందడి చేయబోతున్నారు.
మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఫినాలేకి రాబోతున్నారట. ముందు నుంచి ఏ సీజన్ తీసుకున్నా సరే.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో ఎవరో ఒక స్టార్ హీరో గెస్ట్‌గా వచ్చి.. విన్నర్‌ని ప్రకటిస్తున్నారు. దీంతో ఈ సారి ఏ హీరో గెస్ట్‌గా వస్తాడా? అనేది ఆసక్తిరంగా మారింది. అందుకుతగ్గట్టే ఇప్పుడో ఊహించని గెస్ట్ తెరపైకి వచ్చాడు. బిగ్ బాస్ 7వ సీజన్ ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. అప్పుడప్పుడు మహేష్ బాబు కొన్ని షోలకు వచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటాడు. ఆ మధ్య కూడా ఓ ఛానల్లో నిర్వహించిన కార్యక్రమం కోసం కూతురు సితారతో కలిసి సందడి చేశాడు మహేష్.
ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌కి రాబోతున్నట్టుగా సమాచారం. బిగ్ బాస్ 7వ సీజన్ విజేతలను ప్రకటించి ట్రోఫీ అందజేయబోతున్నాడట మహేష్ బాబు. ఈ వేదిక మహేష్ లేటెస్ట్ ఫిల్మ్ గుంటూరు కారం ప్రమోషన్స్‌కు కూడా కలిసి రానుంది. అందుకే.. మహేష్ ఈ షోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఏదేమైనా.. ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.