కొత్తవలస: కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలోని బలిఘట్టం వద్దనున్న కొత్తవలస సచివాలయం-3 రైతు భరోసా కేంద్రంలో యూరియా కోసం పలు గ్రామాల రైతులు ఉదయం నుంచి పడిగాపులు పడుతున్నారు. ఎండలో నిరీక్షించలేక వారికి చెందిన దస్త్రాలు, పాసుపుస్తకాలను లైన్లో పెట్టి అధికారుల రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వైసీపీ నాయకులు అన్నారు.