»Prasanna Vadanam Movie Review Has Suhas Hit Again
Prasanna Vadanam Movie Review: సుహాస్ ఖాతాలో మళ్లీ హిట్ పడిందా!
కలర్ ఫొటోతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. కొత్త కొత్త కథలతో ముందుకు దుసుకుపోతున్నాడు. తాజాగా ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో సుహాస్‌కు జోడీగా పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించింది. రాశీసింగ్, నందు, వైవా హర్ష, సాయి శ్వేత, నితిన్ ప్రసన్న ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అర్జున్ వైకే దర్శకత్వం వహించాడు. అయితే ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సూర్య(సుహాస్) అమ్మానాన్నలు ఓ యాక్సిడెంట్లో చనిపోతారు. దీంతో అతనికి ఫేస్ బ్లైండ్ నెస్(ప్రోసోపాగ్నోసియా) అనే సమస్య వస్తుంది. ఎవరి ముఖాలను కూడా గుర్తుపట్టలేడు, వాయిస్‌ని గుర్తించలేడు. సూర్య రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. తనకి ఉన్న ఈ సమస్య గురించి ఎవరి తెలియకుండా జాగ్రత్తలు పడుతుంటాడు. కానీ తన స్నేహితుడు అయిన విఘ్నేష్(వైవా హర్ష)కి మాత్రమే చెబుతాడు. అలా ఆద్య(పాయల్)తో ప్రేమలో పడతాడు. అయితే ఈక్రమంలో అతని కళ్లముందు ఓ హత్య జరుగుతుంది. తనకి ఉన్న సమస్య వల్ల ఆ హత్య ఎవరు చేశారో తెలుసుకోలేడు. ఈ విషయం పోలీసులకి తెలియజేయాలని చూస్తాడు. దీంతో అతనిపై దాడి జరుగుతుంది. అయిన వెనకడుగు వేయకుండా ఏసీపీ వైదేహి(రాశిసింగ్) దగ్గరికి వెళ్లి విషయం చెబుతాడు. తన సమస్యను కూడా తెలియజేస్తాడు. అనుకోకుండా ఆ హత్య కేసులో ఇరుక్కుంటాడు. అసలు ఆ హత్య చేసింది ఎవరు? హత్యకి గురైన అమ్మాయి ఎవరు? ఆ కేసులో సూర్యని ఎందుకు ఇరికించారు? ఆ కేసు నుంచి తాను ఎలా తప్పించుకున్నాడు? తన ప్రేమ కథ ఏం అయ్యింది? అనే విషయాలు తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
సినిమా స్టార్ట్ అయిన వెంటనే కొన్ని సీన్లు అతికించినట్లు అనిపిస్తుంది. సూర్య మర్డర్ చూసిన వెంటనే కథ కొంచెం ఆసక్తిగా సాగుతుంది. ఇలాంటి డిజార్డర్‌తో సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో సుహాస్ కూడా కొత్తగా కనిపిస్తాడు. మర్డర్ సీన్ నుంచి కథ మలుపులు తిరుగుతుంది. కథానాయకుడికీ, అతని స్నేహితుడికీ మధ్య సన్నివేశాలు, ఆద్యతో ప్రేమాయణం ఎపిసోడ్‌తో సన్నివేశాలు సరదా సరదాగా సాగిపోతాయి. విరామానికి ముందు నుంచి కథ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. ద్వితీయార్థంలో నేరస్తుడు ఎవడని సుహాస్ కనిపెట్టడంలో ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు, ఇంట్రెస్ట్ పెంచే కొన్ని సన్నివేశాలు సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చుతాయి. కథలో వేగం తగ్గినట్టు అనిపించిన.. కథలో కొత్తదనం, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే సుహాస్ ఖాతాలో మరో హిట్ పడినట్టే.
ఎవరెలా చేశారంటే?
సుహాస్ నటన ఆకట్టుకుంటుంది. పాత్రకు తగ్గట్లు నటించాడు. తనదైన నటనలో ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అలరించాడు. పాయల్ తన అందంతో పాత్రలో ఒదిగిపోయింది. సుహాస్‌కి, పాయల్‌కి మధ్య సన్నివేశాలు సరదాగా ఉంటాయి. రాశిసింగ్ పోలీస్ అధికారిగా మెప్పించింది. మిగతా వాళ్లు పాత్రలకు తగ్గట్టు నటించారు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విషయానికొస్తే చాలా బాగుంది. సినిమా కలర్ఫుల్గా ఉంది. నేపథ్య సంగీతం కూడా బాగుందని చెప్పుకోవచ్చు. కథలో వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఎడిటింగ్ ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ కథను అనుకున్న రీతిలో తెరపై ఆసక్తిగా చూపించారు. నిర్మాణ పరంగా కూడా బాగుంది.
ప్లస్ పాయింట్స్
+కథలో కొత్తదనం
+సుహాస్ నటన
+ద్వితీయార్థం