W.G: వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం వీరవాసరం, పెర్కిపాలెం కొనితివాడ, నవుడూరు, ఉత్తరపాలెం, మత్స్యపురిపాలెం గ్రామసచివాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి 200 రోజులు పని చూపాలని నాయకులు డిమాండ్ చేశారు.

