KDP: సిని నిర్మాత బండ్ల గణేష్ హైదరాబాద్ నుంచి తిరుపతికి చేపట్టిన సంకల్ప యాత్ర సోమవారం మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఆయనను కలిసి యాత్రకు సంఘీభావం తెలిపారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ.. దేవుడి మొక్కు తీర్చుకోవడం కోసం పాదయాత్ర మొదలు పెట్టాను. నేటికి 350 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిందన్నారు.

