AP: శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, బీసీ జనార్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఎలాంటి రుసుం తీసుకోకుండా భక్తుల వాహనాలు అనుమతించాలని సూచించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత, సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని సీఎం ఆదేశించారని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు 50 శాతం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

