RR: చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

