మహబూబ్నగర్ జిల్లా కేంద్రం పాత పాలమూరు ప్రాంతానికి చెందిన పీ.రాఘవేందర్ సోమవారం ఆకస్మికంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అతడి ఇంటికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

