PLD: “స్వచ్ఛ శివరాత్రి-స్వచ్ఛ నరసరావుపేట” కార్యక్రమంలో భాగంగా పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అరవిందబాబు ఇవాళ పరిశీలించారు. రూ.50 లక్షల ప్రత్యేక నిధులతో చేపడుతున్న సైడ్ డ్రైన్ల నిర్మాణం, పారిశుద్ధ్య పనుల పురోగతిని ఆయన పరిశీలించి, పనుల నాణ్యత, గడువుపై ఎలాంటి రాజీ లేకుండా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

