VSP: సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్ సోమవారం నిర్వహించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిన నేపథ్యంలో దృష్టి మళ్లించేందుకే బూతు రాజకీయాలకు దిగిందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ కవ్వింపు చర్యలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

