E.G: పెరవలి మండలంలో కానూరు నుంచి నడుపల్లికోట వరకు 1.4 కి.మీ పొడవున నాబార్డ్ నిధులతో నిర్మిస్తున్న రహదారి పనులను మంత్రి కందుల దుర్గేష్ సోమవారం పరిశీలించారు. రహదారి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి, త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.

