HYD: అత్తాపూర్ పిల్లర్ నం.140 వద్ద మాదకద్రవ్యాల విక్రయాలపై రాజేంద్రనగర్ పోలీసులు మెరుపు దాడి చేశారు. నమ్మదగిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఒడిశాకు చెందిన రమాకాంత్ నాయక్ వద్ద కేజీ గాంజా లభ్యమైంది. దానిని కొనుగోలు చేసేందుకు వచ్చిన కేరళకు చెందిన ధీరజ్‌ను కూడా అదుపులోకి తీసుకుని డ్రగ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

