PLD: కలెక్టర్ కృతిక శుక్లా తన ఉదారతను చాటుకున్నారు. ఇవాళ ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కు వచ్చిన దివ్యాంగులు తన వద్దకు వచ్చే వరకు వేచి చూడకుండా, ఆమే స్వయంగా వారి దగ్గరకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల పట్ల ఆమె చూపిన ఈ చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

