కృష్ణా: క్రీడారంగంలో ఏపీ కీర్తిని బాడీబిల్డర్ బీరం ప్రశాంత్ మరోసారి చాటారు. నేపాల్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆయన, చెన్నైలో జరిగిన దక్షిణ భారత బాడీబిల్డింగ్ పోటీల్లో ‘మిస్టర్ సౌత్ ఇండియా’ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో వరుస విజయాలు అందుకుంటున్న ప్రశాంత్ ఘనతపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

