NZB: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వారి ఆలోచన విధానంలో మార్పు రానన్ని రోజులు బీఆర్ఎస్ను ఎవరు కాపాడలేరన్నారు. మున్సిపల్ ఎన్నికల వరకు ఈ కేసు విచారణ పేరిట హడావుడి చేస్తున్నారన్నారు.

