Ambajipeta Marriage Bandu: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ట్రైలర్.. గుండుతో సుహాస్
మిగతా హీరోల్లా.. తను కూడా సూపర్ హీరో అనేలా కాకుండా.. రియాల్టీకి దగ్గరగా తనకు సరిపోయే కథలతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు సుహాస్. తాజాగా తన లేటెస్ట్ ఫిల్మ్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' ట్రైలర్ రిలీజ్ చేయగా గుండుతో సరికొత్తగా కనిపించాడు సుహాస్.
Trailer of 'Ambajipeta Marriage Bandu'.. Gundu Suhas
Ambajipeta Marriage Bandu: అప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించిన సుహాస్.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి సత్తా చాటాడు. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. కలర్ ఫోటోతో తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు.. మధ్యలో హిట్ 2 సినిమాలో విలన్‌గా కూడా మెప్పించాడు. చివరగా రైటర్ పద్మభూషన్ సినిమాతో అలరించిన సుహాస్.. ఇప్పుడు అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు దుశ్యంత కటికనేని తెరకెక్కించిన ఈ సినిమాను ఫిబ్రవరి 2న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. తాజాగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పై అంచనాలు పెరిగిపోయేలా ఉంది.
బ్యాండు మేళం అంటే ఏదో సరదాగా సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఎంటర్టైన్మెంట్తో పాటు పక్కా ఎమోషనల్ డ్రామాగా సినిమా ఉంటుందని చెప్పేశారు మేకర్స్. బ్యూటీఫుల్ లవ్ ట్రాక్‌తో మొదలైన ట్రైలర్.. ఒక్కసారిగా లవ్ ట్రాక్ నుంచి సెంటిమెంట్‌కు టర్న్ అవుతుంది. హీరోకి అక్క విషయంలో కొన్ని ఎదురయ్యే పరిస్థితులు.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? తన లవ్ స్టోరీ ఏమైంది? అనేలా ట్రైలర్ కట్ చేశారు. అంతేకాదు సుహాస్ గుండుతో కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం సుహాస్ నిజంగానే గుండు కొట్టించుకున్నాడు. దీంతో అంబాజీ పేట పక్కా ఎమోషనల్ టచ్‌గా రాబోతుందనే చెప్పాలి. మరి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఎలా ఉంటుందో చూడాలి.