»Ester My Name Should Be In The Bracket Only Then Will I Sign Any Film
Ester: బ్రాకెట్లో నా పేరుండాలి.. అప్పుడే ఏ సినిమాకైనా సైన్ చేస్తా.
తేజా డైరెక్షన్లో తెలుగు తెరకి 1000 అబద్ధాలు సినిమాతో పరిచయమైన బెహ్రైన్ బ్యూటీ ఎస్తర్. హిందీ, కన్నడ, కొంకిణీ, తెలుగు వంటి భాషలలో యాభై సినిమాల వరకూ చేసినా ఇంతవరకూ ఏ భాషలోనూ కూడా స్ట్రాంగ్ పొజిషన్ తెచ్చుకోలేకపోయింది.
Ester: తేజా డైరెక్షన్లో తెలుగు తెరకి 1000 అబద్ధాలు సినిమాతో పరిచయమైన బెహ్రైన్ బ్యూటీ ఎస్తర్. హిందీ, కన్నడ, కొంకిణీ, తెలుగు వంటి భాషలలో యాభై సినిమాల వరకూ చేసినా ఇంతవరకూ ఏ భాషలోనూ కూడా స్ట్రాంగ్ పొజిషన్ తెచ్చుకోలేకపోయింది. చూడ్డానికి క్యూట్‌గా ఉండి, తెలుగు కూడా అనర్గళంగా మాట్లాడగలిగే అతి తక్కువమంది హీరోయన్లలో ఎస్తర్ పేరే ముఖ్యంగా చెప్పాలి. 2023 డిసెంబర్లో విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ స్టారర్ డెవిల్లో లాస్ట్ అప్పీరియన్స్ ఎస్తర్ది. తర్వాత మళ్లీ ఇప్పుడు ఎక్కువ గ్యాప్ లేకుండానే యుగంధర్ దర్శకత్వంలో ఈ నెల 19న విడుదల కాబోతూన్న టెనెంట్ సినిమా ద్వారా మళ్లీ మరో స్టన్నింగ్ రోల్లో ఆడియన్స్ ముందుకి రాబోతోంది.
టెనెంట్ ప్రెస్‌మీట్ టైంలో పాత్రికేయుల ప్రశ్నలకు ఎస్తర్ చలాకీగానే సమాధానాలిచ్చింది. ఎక్కడా డిజప్పాయంట్మెంట్ అన్నది లేకుండానే ఆన్సర్ చేస్తూ వచ్చింది ఓపిగ్గా. కాకపోతే కొన్ని పాయంట్లకి మాత్రమ చిరుకోపానికి గురైందనే చెప్పాలి. అందచందాలు, పర్సనాలిటీ ముఖ్యంగా చక్కటి తెలుగు మాట్లాడగలిగే అవకాశం ఇన్ని ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎందుకు తెలుగులో బిజీ కాలేకపోతోంది, పెద్ద సినిమాలు ఎందుకు చేయలేకపోతోంది. ఇవే ప్రశ్నలని మీడియాలో కొందరు సందేహించగానే ఎస్తర్ కొంచెం హాట్‌గా మారింది. పెద్ద సినిమాల ప్రెస్ మీట్లకి వెళ్లినప్పుడు వాళ్లనే అడగండి. నన్నెందుకు అడుగుతారని రియాక్ట్ అయ్యింది.
ఏదో ఒక లేడీబాడీ ఉంటే చాలు అనుకునే పాత్రలైతే మాత్రం చేసే ప్రసక్తే లేదు. నాకంటూ చిన్న క్యారెక్టర్ అయినా ఫరవాలేదు. కానీ కథలో దానికేదో ఒక పర్పజ్ ఉండితీరాలి. నా క్యారెక్టర్ని స్క్రీన్ మీద చూసుకుని నేను సేటిస్ఫై కావాలి. ఇదిగో ఇంత రెమ్యూనరేషన్, ఇన్ని రోజులు కాల్షీట్స్ అని చెబితే వెంటనే ఒప్పేసుకుని గెంతుకుంటూ షూటింగ్‌కి వెళ్ళిపోయే మూడ్‌లో మాత్రం నేను లేను. ఉండను కూడా. ఆ అవసరం లేదు నాకు. ఇదిగో ఇప్పుడు టెనెంట్ సినిమాలో క్యారెక్టర్.. నాకు నచ్చి చేస్తున్నా. డైరెక్టర్ యుగంధర్గారు మంచి కథ చేశారు. నా క్యారెక్టర్‌కి ఓ స్పెషాలిటీ ఉంది. చేస్తున్నప్పుడు ధ్రిల్ అనిపించింది. కథ విన్నప్పుడైతే అసలు నేను చేయగలనా అనిపించింది కూడా. కానీ యుగంధర్ గారు మాత్రం పట్టుబట్టి నా చేత చేయించారు. ఈ సినిమా డెఫినెట్‌గా హిట్ అవుతుంది. అందరికీ నచ్చుతుంది. నాకు మంచి పేరుకూడా వస్తుందని ఎస్తర్ చెప్పింది .