వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
YS Sharmila: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జమ్మలమడుగు తన జన్మస్థలమని, అక్కడ క్యాంబెల్ ఆసుపత్రిలో ఆమె పుట్టారని తెలిపారు. మీ నాయకులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి మాతో ఎలా ఉన్నారో.. మీకోసం కూడా అలానే ఉన్నారు. ఎప్పుడు పిలిచానా పలికేవారు. వివేకం సార్ అని పిలిస్తే వెంటనే సమస్యకు పరిష్కారం దొరికేది. జిల్లాకు స్టీల్‌ప్లాంట్ తీసుకురావాలని వైఎస్ఆర్ కలలు కన్నారు. జగన్ రెండుసార్లు శంకుస్థాపన చేశారు. కానీ పనులు జరగలేదు.
వైఎస్ఆర్ కలల ప్రాజెక్టుకే దిక్కులేదని షర్మిల అన్నారు. జిల్లాలో నేను ప్రచారం చేయడంతో వైసీపీలో వణుకు పుడుతోంది. హంతకుడు అవినాష్ అని ప్రజలు నమ్ముతున్నారు. దానికి సంబంధించి సీబీఐ అన్ని ఆధారాలు బయటపెట్టింది. అయిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జగన్ అవినాష్‌ను కాపాడుతున్నారు. హత్యా రాజకీయాలకు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసి ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలి. ఈ అన్యాయాన్ని ఎదురించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నారు. మీకు వైఎస్ బిడ్డ కావాలో.. హంతకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలని షర్మిల అన్నారు.