IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ రిలీజ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఎడిషన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తమ జెర్సీని(New Jersey) మార్చి 16న రిలీజ్ చేసింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ప్రకటించింది. ఆ వీడియోలో మయాంక్ అగర్వాల్, పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు జెర్సీ ధరించి ఉండటం చూడవచ్చు.
మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా జట్లు పోటీ పడేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు వారి అధికారిక జెర్సీని(New Jersey) ఆవిష్కరించింది. సైన్ రైజర్స్ హైదరాబాద్ లోగో ప్రింట్ చేసిన ఈ జెర్సీ ఆరెంజ్ కలర్(orange), చేతులు, కాలర్స్ దగ్గర నలుపు రంగుల్లో(black colour mix) ఉన్న ఈ జెర్సీ ఆకట్టుకుంటుంది.
ఈ కొత్త కిట్‌ను పంచుకోవడానికి వారు తమ అధికారిక సోషల్ మీడియా(social media) అకౌంట్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసి ప్రకటించారు. ఈ వీడియోలో ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్, స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ వంటి వారు జెర్సీ(Jersey) దుస్తులు ధరించి ఉండటం చూడవచ్చు. ఇక అసలు ఐపీఎల్ 2023(ipl 2023) పోరు మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్ మాత్రం ఆదివారం ఏప్రిల్ 2న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఇటీవల దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ IPL 2023కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో ఐపీఎల్ 2023 జరగనుంది. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరగనున్నాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది. ఇక ఈ టోర్నమెంట్లో 18 డబుల్ డెక్కర్( Double decker) మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక గ్రూప్-ఏలో ముంబై, కోల్‌కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో జట్లు తలబడనుండగా.. గ్రూప్-బీలో చెన్నై, హైదరాబాద్, పంజాబ్, బెంగళూరు, గుజరాత్ పోటీ పడతాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు ఎంతో ప్రత్యేకం. గెలిచేది ఏ జట్టు అయినా అది తమ జట్టుగానే భావిస్తారు భారతీయులు. మొత్తం 10 జట్లు ఉన్నప్పటికీ ఒక్కో అభిమానికి ఒక్కో జట్టు ఫేవరెట్ గా ఉంటుంది. ఐపీఎల్ (IPL) ప్రారంభించినప్పటి నుంచి అన్ని సీజన్లూ సూపర్ హిట్ అయ్యాయి. కొత్త కుర్రాళ్లలో ప్రతిభను బయటకు తీయడానికి, వారిని ప్రోత్సహించడానికి కూడా ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది.