»Indian Wrestlers Protest Neeraj Chopra Kapil Dev Demand Justice For Protesting Wrestlers
Wrestlers Protestకు క్రీడా దిగ్గజాలు నీరజ్ చోప్రా, కపిల్ దేవ్ మద్దతు
కొన్ని వారాలుగా తమకు న్యాయం కావాలంటూ రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్న భారత రెజ్లర్లకు సినీ, క్రీడా ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. రోజురోజుకు వారి ఉద్యమానికి (Wrestlers Movement) అన్ని వర్గాల వారు మద్దతు పలుకుతున్నారు.
అంతర్జాతీయంగా భారతదేశానికి (India) పతకాలు (Medals) తీసుకొచ్చి అంతర్జాతీయ వేదికల్లో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన వారు స్వదేశంలో రోడ్లపైకి చేరుకున్నారు. విదేశాల్లో అద్భుత గౌరవం, మర్యాదు పుచ్చుకునే క్రీడాకారులు (Sportsmen) భారత్ లో మాత్రం లైంగిక వేధింపులు (Harrasment), దాడులకు గురవుతున్నారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న బాధితులపైనే కొందరు విమర్శలు చేయడం మరింత ఆవేదనకు గురి చేసే అంశం. కాగా కొన్ని వారాలుగా తమకు న్యాయం కావాలంటూ రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్న భారత రెజ్లర్లకు (Wrestlers) సినీ, క్రీడా ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. రోజురోజుకు వారి ఉద్యమానికి (Wrestlers Movement) అన్ని వర్గాల వారు మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) వీరి ఆందోళనకు మద్దతు తెలిపారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India -WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) తమపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని, తమకు న్యాయం చేయాలని భారత దిగ్గజ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా తో పాటు పెద్ద ఎత్తున రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనను చూసి నీరజ్ ఆవేదనకు లోనయ్యాడు. ట్విటర్ లో నీరజ్ ఓ ప్రకటన విడుదల చేశాడు.
‘మన అథ్లెట్లు న్యాయం (Justice) కోసం వీధుల్లోకి రావడం నాకు బాధ కలిగించింది. వారు మన దేశానికి ప్రాతినిథ్యం వహించడానికి, మనల్ని గర్వపడేలా చేయడానికి చాలా కష్టపడ్డారు. ప్రతి వ్యక్తి సమగ్రతతో పాటు గౌరవాన్ని కాపాడే బాధ్యత మనపై ఉంది. అది క్రీడాకారుడైనా కాకపోయినా కూడా. ప్రస్తుతం జరుగుతున్న విషయం ఇంకెప్పుడూ జరగకూడదు. ఇది సున్నితమైన సమస్య. నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా వ్యవహరించాలి. న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అంటూ నీరజ్ చోప్రా ఓ ప్రకటనను ట్విటర్ (Twitter) లో విడుదల చేశాడు. కాగా రెజ్లర్ల ఆందోళనకు ప్రపంచ చాంపియన్ భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా (Abhinav Bindra) కూడా మద్దతు తెలిపాడు. ఇక వీరి ఆందోళనకు సినీ ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతున్నారు. సినీ నటి ఊర్మిళ (Urmila), క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev), ప్రముఖ క్రీడాకారుడు శివ కేశవన్ మద్దతు తెలిపారు. భారతదేశాన్ని సగర్వంగా నిలుపుతున్న వారికి ఇలాంటి పరిస్థితి రావడం దయనీయమని పేర్కొంటున్నారు.